లాక్ డౌన్ కాలంలో నేనున్నానంటూ అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచి మానవత్వానికి మారు పేరుగా నిలిచిన నటుడు సోనూసూద్ కి అరుదైన గౌరవం దక్కింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సొంత ఖర్చులతో వలస కార్మికులను వారి గ్రామాలకు పంపించిన ఆయనపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి నుంచి ‘ఎస్ డి జి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్’ అవార్డును సోనూ సూద్ అందుకున్నారు. ఈ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. సోమవారం సాయంత్రం జరిగిన వర్చువల్ వేడుకలో ఈ అవార్డును సోనూ సూద్‌కు అందజేశారు.
ఇక సోనూ సూద్ కు అన్ని వర్గాల నుంచి అభినందలన వర్షం కురుస్తోంది. ప్రముఖ రచయిత్రి శోభా డే..మా రియల్ హీరోకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. దానికి సమాధానంగా శోభా..మీ విషేస్ మ్యాజిక్ చేస్తుంది అని ట్వీట్ చేశారాయన.