కొత్తగూడెం అడవుల్లో ఎన్‌కౌంటర్.. మవోయిస్టు మృతి

0
83

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల మండలంలోని దేవలగూడెం అటవీ ప్రాం తంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టుల కదలికలపై సమాచారం అం దుకున్న పోలీసులు గురువారం ఉదయం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మవోయిస్టు మృతి చెందాడు. ప్రస్తుతం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

ఓవైపు డీజీపీ మహేందర్‌ రెడ్డి ఏజెన్సీలో పర్యటిస్తున్న సమయంలోనే భద్రాద్రి కొ త్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో మావోయి స్టు‌ ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ మహేందర్‌ రెడ్డి బుధవారం ఏరియల్‌ సర్వే నిర్వహిం చారు. తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరి హద్దు ప్రా ణహిత పరివాహకంలోని ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. గడిచిన నెల రోజుల వ్య వధిలో డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీకి వెళ్లడం ఇది రెండోసారి.

మరోవైపు, ఘటనా స్థలం నుంచి కొందరు మావోయిస్టుల పారిపోయారన్న సమాచా రంతో.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, జులై 15న కూడా భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. మణుగూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని కరకగూడెం, ఆళ్ల పల్లి మండలాల సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కా ల్పు లు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఒకరు గాయపడగా.. 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి కాల్పులు జరగడంతో భద్రాలచం ఏజెన్సీ ఉలిక్కిపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here