సైబర్ నేరగాళ్ల చేతికి ప్రధాని ట్విటర్ ఖాతా
ఉదయం 03.15 కు హ్యక్ చేశారు
హ్యాక్ అయినట్లు ప్రకటించిన ట్విటర్
ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్సనల్ ట్విటర్ అక్కౌంట్ హ్యాక్ అయ్యింది. దీనిని ట్విటర్ అధికారికంగా ధ్రువీకరించింది. భారత ప్రధాన మంత్రి మోడీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్ గురువారం తెల్లవారు జామున హ్యాక్ అయిందని, విచారణ ప్రారంభించినట్లు ట్విటర్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఖాతాను పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. కాగా కోవిడ్-19 నేపథ్యంలో పీఎం నేషనల్ ఫండ్ ద్వారా క్రిప్టోకరెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వాలని ఆయన కోరినట్లుగా నేరగాళ్లు వరుస ట్వీట్లు చేశారు. ఈ ఖాతాను జాన్ విక్ హ్యాక్ చేసింది. మేం పేటీఎం మాల్‌ను హ్యాక్ చేయలేదని వారు ట్వీట్లలో పేర్కొన్నారు.

కాగా ప్రధాని వ్యక్తిగత వెబ్సైట్ లింక్ narendramodi_in హ్యాండిల్‌కు పాతిక లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ అకౌంట్ నుంచి మోదీ ఇప్పటి వరకు సుమారుగా 37 వేల ట్వీట్లు చేశారు. చివరిసారిగా ఆగష్టు 31న మన్ కీ బాత్ గురించి ఇందులో ప్రస్తావించారు. ఇక ట్విటర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలైలో పలువురు ప్రముఖుల ఖాతాలు హ్యాక్ అయ్యాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన జో బిడెన్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ప్రముఖ బిలియనీర్ వారెన్ బఫెట్ తదితరుల ఖాతాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. వీరితో పాటు అనేక వ్యాపార సంస్థల పేరిట ట్వీట్లు పెట్టిన హ్యాకర్లు.. డిజిటల్ కరెన్సీ(బిట్‌కాయిన్) స్కామ్‌కు విఫలయత్నం చేశారు. కాగా గతేడాది ఆగష్టులో ట్విటర్ సీఈవో, సహ వ్యవస్థపాకుడు జాక్ డోర్సీ ఖాతాను హ్యాక్ చేసిన నేరగాళ్లు వివాదాస్పద ట్వీట్లతో బెంబేలెత్తించిన విషయం తెలిసిందే.
తాజా హ్యాక్ తో అప్రమత్తమైన ట్విటర్ ఇండియా టీమ్ హ్యాకర్లు చేసిన ట్వీట్లను తొలగించింది. ప్రస్తుతం ఆ ఖాతాను తమ ఆధీనంలోకి తీసుకుంది. వరుసగా ఇలాంటి ఘటనలు జరగుతుండడంతో వీటిని అరికట్టేందుకు ట్విటర్ టెక్నికల్ టీమ్ తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
finest post, i love it