కరోనా పరిస్థితులపై రేపు మోడీ సమీక్ష

0
76

కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ రేపు (గురువారం) వర్చువల్‌ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించనున్నారని కేంద్రం తెలిపింది. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా స్థితిగతులు, వైరస్‌ మహమ్మారిను ఎదుర్కోవడంలో ఉన్న సంసిద్ధతపై సిఎంలతో ప్రధాని చర్చించనున్నారు.

దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 63 శాతం , మరణాల్లో 77 శాతం మహారాష్ట్రతో , ఆంధ్రప్రదేశ్‌, క ర్నాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీలలో నమోదయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇతర ఐదు రాష్ట్రాలతో పాటు పంజాబ్‌, ఢిల్లీలలో కూడా ఇటీవల తాజాగా నిర్ధారణ అవుతున్న కేసుల్లో పెరుగు దల కనిపిస్తోందని, మహారాష్ట్ర, పంజాబ్‌, ఢిల్లీలలో అయితే 2 శాతం కంటే ఎక్కువగా మరణాల రేటు ఉం దని తెలిపింది. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లు కాకుండా ఇతర రాష్ట్రాల్లో దేశ సరాసరి కంటే పాజిటివిటీ రేటు అధికంగా ఉందని పేర్కొంది.

మరోవైపు ఆరోగ్య పరిరక్షణ, వైద్య మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రాలకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నట్లు కేంద ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ-ఐసియు టెలీ కమ్యూనికేషన్‌ ద్వారా ఐసియుల్లో ఉండే వైద్యుల్లో క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ సామర్ధ్యాన్ని పెంచినట్లు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here