టైమ్ మ్యాగజైన్ లిస్టులో మోడీతో పాటు 82 ఏళ్ల ఢిల్లీ ముస్లిం మహిళ

0
112

మకాలీన ప్రపంచంపై ప్రభావం చూపిన 100 మంది మార్గదర్శకులు, నాయకులు, టైటాన్లు, కళాకారు లు, ఐకాన్ ల వార్షిక జాబితాను టైమ్ పత్రిక విడుదల చేసింది. టైమ్ మ్యాగజైన్ ‘100 అత్యంత ప్రభావ వంతమైన వ్యక్తులు 2020’ జాబితాలో ఐదుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు.

ప్రధాన మం త్రి నరేంద్ర మోడీతో పాటు నటుడు ఆయుష్మాన్ ఖురానా , షాహిన్ బాగ్ ఆందోళన కారిణి 82 ఏళ్ల బిల్కిస్, గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చయ్య, క్లినికల్ మైక్రోబయాలజి ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా టైమ్ మ్యాగజైన్ జాబితాలో ఉన్నారు.

“వాస్తవానికి ప్రజాస్వామ్యానికి కీలకం స్వేచ్ఛాయుత ఎన్నికలు కాదు. ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో మాత్రమే ఎన్నికల ద్వారా తెలుస్తుంది. అంతకంటే ముఖ్యమైనది విజేతకు ఓటు వేయని వారి హక్కులు . ఏడు దశాబ్దాలకు పైగా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. 1.3 బిలియన్ల జనాభాలో క్రై స్తవులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇలా ఎన్నో ఇతర మతాలవారు ఉన్నారు. సుస్థిరత, సామరస్యానికి ప్రతీకగా ఈ మతాలకు చెందింన ప్రజలు భారతదేశంలోనే నివసిస్తున్నారని దలైలామా (తన జీవితంలో ఎక్కువ భాగం అక్కడ ఆశ్రయం గడిపారు) ప్రశంసించిన విషయాన్ని టైమ్స్ ఎడిటర్ కార్ల్ విక్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అయితే “నరేంద్ర మోడీ వీటన్నిటిని సందేహానికి గురిచేశారు.ఇప్పటి వరకు భారతదేశ ప్రధాన మంత్రు లంతా దాదాపు 80% గా హిందూ మతానికి చెందినవారే అయినప్పటికీ మోడీ మాత్రం ఎవరినీ లెక్కచే యనట్టుగా పాలన సాగిస్తున్నారు. మొదట అభివృద్ధి హామీతో ఎన్నికయ్యారు. ఆయన హిందూ-జాతీ యవాద భారతీయ జనతా పార్టీ ఎలైటిజం(elitism)తో పాటు ప్లూరలిజం (pluralism)ని కూడా తి రస్కరించింది. ముఖ్యంగా భారతీయ ముస్లింలను. దీనికి వ్యతిరేకంగా ఎగిసిన అసమ్మతిని అరిక ట్టడా నికి బీజేపీ ప్రభుత్వానికి కరోనా మహమ్మారి ఒక సాకుగా మారింది. అంతేకాదు, దానితో ప్రపం చంలోని అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి చీకట్లు ముసురుకున్నాయి” అని విక్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here