అత్యంత విషమంగా బాలు ఆరోగ్య పరిస్థితి

21
268

రేపో మాపో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారనుకున్నారు. కానీ ఇంతలోనే మళ్లీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేశారు.

గత 24 గంటలుగా బాలు ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఎక్మో, వెంటిలేటర్ సాయంతో బాలుకు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. నిపుణుల వైద్య బృందం పర్యవేక్షణలో ఎస్పీ బాలు ఉన్నారని ఎంజీఎం వైద్యులు తెలిపారు.

గా కరోనా నుంచి ఇటీవల కోలుకున్న ఆయనకు మళ్లీ అనారోగ్యం తిరగబెట్టింది. 40 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. బాలసుబ్రహ్మణ్యంకు అనారోగ్యం తిరగబెట్టడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి క్షేమంగా తిరిగి రావాలని దేశ వ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=pAPcYZAdaH4

21 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here