వైవిద్యమైన సినిమాలు రూపొందించే దర్శకులలో క్రిష్ ఒకరు. ప్రస్తుతం ఆయన వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో ఓ సినిమాను రూపొందిస్తోన్నారు. దీని తరువాత పవన్ కల్యాణ్ తో సినిమా చేయబోతున్నా రు. అది పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 27వ సినిమా.
ప్రస్తుతం పవన్ ‘వకీల్‌సాబ్’ షూటింగ్ పూర్తి కాగానే ఇది సెట్స్ మీదకు వెళుతుంది. అయితే ఈ చిత్రానికి టైటిల్ వేటలో పడ్డారు క్రిష్ ఇప్పుడు. బందిపోటు, గజదొంగ, ఓం శివమ్.. ఇలాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ లిస్టులో అంతర్వాహిని అనే టైటిల్ కూడా చేరినట్లు వార్తలు వినిపిస్తు న్నాయి. అయితే అంతర్వాహిని టైటిల్ విషయం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో క్రిష్ తన ఇన్‌స్టాలో రైట ర్ సాయిమాధవ్ బుర్రా రాసిన అంతర్వాహిని అనే కవితను పోస్ట్ చేశారు. ఈ కవిత నచ్చి క్రిష్ షేర్ చేశారా? లేక పవన్ 27వ సినిమా టైటిల్ ఇదేనా? అనే దానిపై క్లారిటీ రావాలంటే డైరెక్టర్ క్రిష్ వివరణ ఇవ్వాల్సిందే.
పవన్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీరియాడికి మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాను ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.