అమెరికా తరువాత మనమే…

0
24


కారోనా కేసుల విషయంలో ఇప్పుడు అమెరికా తరువాత మన దేశమే ముందుంది.. బ్రెజిల్‌ను దాటేసి రెండో స్థానానికి చేరింది. 64,60,250 కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. 42,04,614 కేసులతో భారత్‌ రెండో స్థానంలో, 41,37,606 కేసులతో బ్రెజిల్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,802 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 42 లక్షలు దాటింది. ఇక వైరస్‌ బాధితుల్లో తాజాగా 1016 మంది మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య 71,642 కు చేరింది.
భారత్‌లో ఇప్పటివరకు 32,50,429 మంది వైరస్‌ బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 8,82,542 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు 77.30 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.70 శాతంగా ఉందని వెల్లడించింది.
ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1802 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,771 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 895 కు చేరింది. తాజాగా 2711 మంది కోవిడ్‌ పేషంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,10,241.
యాక్టివ్‌ కేసుల సంఖ్య 31,635. దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు 77.25 శాతంగా ఉండగా.. తెలంగాణలో 77.2 శాతంగా ఉందని తాజా హెల్త్ బులెటిన్ తెలిపింది. ఇక దేశంలో కరోనా మరణాల రేటు 1.70 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 0.62 శాతంగా ఉందని వెల్లడించింది. గత 24 గంటల్లో 36,593 వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేశామని, మొత్తం పరీక్షల సంఖ్య 17,66,982 కు చేరిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here