విలక్ష్లణ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు. 74 ఏళ్ల రెడ్డి రాత్రి గుండెపోటుతో పిపోయారు.మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్రూమ్లోనే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయారు. కరోనా కారణంగా షూటింగ్‌లు లేకపోవటంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.
1946 అక్టోబర్ 10న జన్మించిన జయప్రకాశ్ రెడ్డి.. 1988లో ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాతో నటుడిగా ఆయన నటుడిగా రంగ ప్రవేశం చేశారు. అంతకు ముందు నుండే ఆయన నాటక రంగంలో రాణించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా తనదైన ముద్ర వేశారు. ప్రేమించుకుందాం రా సినిమా నటుడిగా ఆయనకు చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతూ ఆయన చెప్పిన డైలాగ్స్ పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సమర సింహారెడ్డి విలన్‌గా ఆయన్ని తిరుగులేని స్థాయిలో నిలబెట్టింది. ఆ తర్వాత జయం మనదేరా, నరసింహనాయుడు ఇలా వరుస చిత్రాలతో తెలుగు,తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. నటుడిగా రాణించినప్పటికీ నాటక రంగంతో ఆయన అనుబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఆయన పలు స్టేజీలపై మోనో యాక్టింగ్ చేసిన అలెగ్జాండర్ నాటకాన్ని సినిమాగా కూడా రూపొందించారు. శత్రువు, లారీ డ్రైవర్, బొబ్బిలిరాజా, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడి పంబ వంటి పలు చిత్రాల్లో నటించారు.