అర్నబ్ కు అనురాగ్ మరో గిఫ్ట్!

0
118

రిపబ్లిక్ టీవీ ఛానెల్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి ని మొన్న చెప్పుల తో ఆశ్చర్యపరచిన బాలీవుడ్ హైలీ టాలెంటెడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ శనివారం ఆయనకు మరో గిఫ్ట్ ఇచ్చాడు. అయితే అది సోషల్ మీడియాల. బహుమతి ఏంటంటే..2012 నాటి వీడియో క్లిప్. అప్పట్లో టైమ్స్ నౌ ఛానెల్ లో పనిచే స్తున్న అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూ మొదలుపెడుతూ కశ్యప్ గురించి అన్న మాటలు ఆ వీడియోలో ఉన్నాయి. అర్నబ్ ఏమన్నాడంటే…ఆయన (అనురాగ్) ఈ స్టూడియోలో ఉండటం నాకు చాలా గర్వ కారణం. ఆయన చాలా సూపర్ టాలెంటెడ్ అంటూ హ్యాండ్ షేక్ కోసం వెళ్తాడు.’

టైమ్స్ నౌలో జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు కశ్యప్ తో పాటు మనోజ్ బాజ్‌పే యి, రిచా చాద్దా కూడా ఉన్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ చిత్రం ప్రమోషన్ కోసం వారు అక్కడికి వె ళ్లారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా..అర్నబ్, కశ్యప్ తమ యూనివర్సిటీ డేస్ గురించి మాట్లాడు కున్నా రు. ఆ తర్వాత గోస్వామి కశ్యప్‌తో ఏమన్నాడంటే “యూనివర్సిటీలో కూడా మీరు చాలా ప్రత్యేకం, చాలా టాలెంటెడ్..మాకు మీలో ఎప్పుడూ ఏదో ఒక స్పార్క్ కనిపించేది. ”

వీడియో అక్కడ కట్ అయి .. ఓ స్సె షల్ సర్ప్రైజ్ తో సీన్ అర్నబ్ ప్రస్తుతం పనిచేస్తున్న చోటు రిపబ్లిక్ టీవీ కార్యాలయంకు మారుతుంది. అ నురాగ్ తన పుట్టినరోజున హాస్యనటుడు కునాల్ కమ్రాతో కలిసి అర్నాబ్ కార్యాలయానికి వెళ్లారు. అప్ప టికే కమ్రా, అర్నబ్ మధ్య విమానంలో జరిగిన గొడవకు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఆసక్తికరమై న విషయం ఏమిటంటే వారు తెచ్చిన ప్రత్యేక బహుమతి ఒక స్లిప్పర్ (చప్పల్) లామినేటెడ్ ఫోటో,. ఇది జర్నలిజంలో గోస్వామి గొప్పగా రాణించినందుకు అవార్డుగా ఆయనకు ఇవ్వటానికి వెళ్లారు. కాని లోప లకు వెళ్లకుండా సెక్యూరిటీ అడ్డుకున్నారు. అయితే వారు అక్కడ తీసిన ఫొటొలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇంతకూ కశ్యప్ ఇలా ఎందుకు చేశాడంటే.. సుశాంత్ కేసులో అర్నబ్ ఉద్దేశపూర్వకంగా కొందరిని టార్గెట్ చేస్తున్నందుకు నిరసనగా. మీడియాలో నేనొక్కడినే పెద్ద తోపు అన్నట్టు వ్యవహరించే అర్నబ్ ..అనురాగ్ కశ్యప్ మధ్య కొంత కాలంగా వార్ నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here