నోకియా 5.3 అమ్మకాలు షురూ

0
58

క్వాడ్ కెమెరా, రెండు రోజుల బ్యాటరీ లైఫ్
6.55 అంగుళాల స్క్రీన్ డిస్ ప్లే
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కెపాసిటీ

హెచ్‌ఎండి గ్లోబల్‌కు చెందిన నోకియా దేశవ్యాప్తంగా నోకియా 5.3 ఫోన్ల విక్రయాలు ప్రారంభించింది. ఈ ఫోన్ నోకియా.కామ్, అమెజాన్.కామ్‌లో అందుబాటులోకి వచ్చిం ది. నోకియా 5.3 4 జిబి+ 64జిబి ధర రూ.13,999, అలాగే 6 జిబి+ 64 జిబి స్టోరేజ్ ధర రూ.15,499గా కంపెనీ నిర్ణయించింది.
ఈ స్మార్ట్ ఫోన్ లో 6.55 ఇంచిల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీనికి 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. మై క్రో ఎస్ డీ కార్డు ద్వారా దీన్ని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్ వెనకభాగంలో ఫిం గర్ ప్రింట్ సెన్సార్, నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామ ర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ లైఫ్ రెండు రోజుల వరకు ఉంటుంది. 10W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.85 సెంటీ మీటర్లుగానూ, బరువు 180 గ్రాములుగానూ ఉంది.
సింపుల్ డిజైన్ లో ఉండే ఈ ఫోన్ సమర్ధవంతమైన మధ్యశ్రేణి స్మార్ట్ ఫోన్ గా మార్కెట్లో నిలుస్తుందని పరిశీలకులు బావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here