కోవిడ్-19 తరువాత కొత్త ప్రపంచం..

0
46

సైన్స్ సాయంతో కొరోనావైరస్ మహమ్మారి వల్ల కలిగే సంక్షోభాన్ని చివరికి మానవత్వం అధిగమిస్తుంది. అనేక సిద్ధాంతాలు, తత్వాలు తెర మీదకొస్తాయి. ప్రజల నుంచి అనేక వ్యాఖ్యానాలు ప్రభుత్వాల ముందుకు వస్తాయి. అయితే, అసలు ప్రశ్న ఏమిటంటే, COVID 19 అనంతర ప్రపంచం మునపటిలా ఉంటుందా లేక మారుతుందా, క్యాపిటలిస్ట్ ఆర్డర్ మరింత అమానవీయంగా, దోపిడీగా మారుతుందా. థామస్ ఎల్ ఫ్రైడ్మాన్ చెప్పినట్టు “COVID-19 ఒక నల్ల ఏనుగు. ఇది ప్రకృతికి వ్యతిరేకంగా మన వల్ల పెరుగుతున్న విధ్వంసక యుద్ధాల తార్కిక ఫలితం ”. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో కార్ల్ మార్క్స్ , మార్క్సిజం కేంద్ర స్థానాన్ని ఆక్రమించుకోవటం బహిరంగ చర్చకు సంబంధించిన అంశం.
“తత్వవేత్తలందరూ ప్రపంచాన్ని తలో రకంగా అర్థం చేసుకున్నారు. అయితే, దానిని మార్చడమే పాయింట్ ”అని మార్క్స్ ఫ్యూయర్‌బాచ్‌పై రాసిన సైద్ధాంతిక వ్యాసంలో పేర్కొన్నాడు మార్క్స్ , అతని జీవితకాల సహచరుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ ల తాత్విక సాధన యొక్క ప్రాథమిక ప్రతిపాదన ఇది. వారు మానవ ఉనికిని, మానవులకు, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని అలాగే ఉత్పత్తి , మానవ జాతుల పునరుత్పత్తి , ఆర్థిక వ్యవస్థలను విశ్లేషించారు.
“సంపదకు మూలం శ్రమ, అంతే కాదు అది మానవ ఉనికికి ప్రధానమైన ప్రాథమిక స్థితి” అని నొక్కి చెబుతూ మార్క్స్ , ఎంగెల్స్ ప్రకృతి తత్వాన్ని విశ్లేషించారు. భూమి, నీరు,గాలి, ప్రజల మధ్య సామరస్యం మార్పులకు ఎలా దారితీస్తుందో వారు ఎత్తి చూపారు. మార్క్స్ తన కాపిటల్ గ్రంథంలో ” మనిషి, ప్రకృతి రెండూ పాల్గొనే ప్రక్రియలో శ్రమది మొదటి స్థానం” అని వివరిస్తారు. కార్మిక ప్రక్రియ అనేది ఉత్పత్తి ప్రక్రియ తప్ప మరేమీ కాదంటారు మార్క్స్. సంపదకు శ్రమ ఎలా మూలం, శ్రమశక్తి మిగులు విలువను ఎలా ఉత్పత్తి చేస్తుందో ఆయన వివరించారు. పెట్టుబడిదారీ విధానం కింద, మిగులు విలువను ఉత్పాదక సాధనాల యజమానులైన పెట్టుబడిదారులు ఎలా స్వాధీనం చేసుకుంటారో కూడా ఆయన కేపిటల్ లో వివరించారు. ఒక దగ్గరే సంపద పేరుకుపోవడానికి, అలాగే అది శ్రామిక ప్రజల పేదరికారినికి మిగులు విలువ ఎలా దారితీస్తుందో కూడా ఆయన వివరించారు. ఇటువంటి అసమానత శ్రామిక వర్గం దయనీయమైన పని పరిస్థితులు , జీవన పరిస్థితులలో ప్రతిబింబిస్తుంది.
సమాజంలోని గృహనిర్మాణ ప్రశ్నను విశ్లేషించేటప్పుడు, ముఖ్యంగా ఈ ప్రశ్నను బూర్జువా ఎలా పరిష్కరిస్తుందో ఎంగెల్స్ ఎత్తి చూపారు “ కార్మికులు రద్దీగా ఉన్నపేద జిల్లాలే అంటువవ్యాదుల బారినపడతాయి. అవి ఎప్పటికప్పుడు పట్టణాలను కూడా కబళిస్తాయి. కలరా, టైఫస్, టైఫాయిడ్ జ్వరం, మశూచి వంటి ప్రమాదకరమైన అంటు వ్యాధుల సూక్ష్మక్రిములు గాలి , విషపూరిత నీటి ద్వారా పట్టణాలలోని శ్రామిక వర్గాలకు అంటుకుంటాయి. ”. భారతదేశంతో సహా అన్ని దేశాల పేదలు, వలస కార్మికులు ఊహించలేని విధంగా ఇబ్బందులను ఎందుకు ఎదుర్కొంటున్నారో, COVID-19 మహమ్మారికి బాధితులుగా ఎందుకు మారుతున్నారో ఇది వివరిస్తుంది.
గత రెండు దశాబ్దాలలో చోటు చేసుకున్న పరిణామాలతో పెట్టుబడిదారులు కార్మికవర్గాల దోపిడీని శాశ్వతం చేసేందుకు కుట్రలు కుతంత్రాలతో కూడిన సరి కొత్త ప్రణాళికల గురించి ఆలోచించేలా చేశాయి. COVID-19 కి ముందు, 2008 లో ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ సబ్ ప్రైమ్ రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రస్తుత మహమ్మారి ప్రపంచ ఆర్థిక క్రమాన్ని వెంటిలేటర్‌లోకి నెట్టివేసింది.
ఈ మహమ్మారి అన్ని దేశాలను, అన్ని వర్గాలను ఒకేలా ప్రభావితం చేస్తుందని భావించేవారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అందువల్ల, మొదట దీనిని పరిష్కరించటినికిప్రభుత్వాలను అనుమతించాలి, తరువాత మన సమస్యల కోసం పోరాడాలి. కానీ అది సరైనది కాదు. పెట్టుబడిదారులు మరింత తెలివైనవారు. మహమ్మారిపై పోరాటం పేరిట, పెట్టుబడిదారీ ప్రభుత్వాలు మరింత నియంత్రణను తమ చేతుల్లో తీసుకుంటున్నాయి.
భారతదేశంలో బిజెపి-ఆర్ఎస్ఎస్ కలయిక దేశాన్ని ఒక దైవపరిపాలన ఫాసిస్ట్ రాజ్యం వైపు నెట్టడానికి ప్రయత్నిస్తోంది.హక్కులను కాలరాస్తూ లక్షలాది మంది సామాన్య ప్రజల జీవితాలను పణంగా పెట్టిన ఈ పెట్టుబడిదారీ, ఫాసిస్ట్ రాజకీయ క్రమానికి వ్యతిరేకంగా శ్రామిక ప్రజల చాపనెలైజ్ చేసే ప్రయత్నాలను వామపక్ష ,లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ముమ్మరం చేశాయి.
ప్రభుత్వ అబద్ధాలు, వైఫల్యాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారీ విధానం ఒకరినొకరు పోరాడటానికి మతాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తుంది, కాని లక్షలాది మంది ప్రజలు మత-ఫాసిస్ట్ పాలకుల యొక్క భయంకరమైన రూపకల్పనను అర్థం చేసుకుంటారు . సమాజాన్ని మరింత విభజించడానికి ప్రజలు అనుమతించరు. మార్క్స్ భారతీయ సామాజిక నిర్మాణాన్ని చూసినప్పుడు, అందులో కుల స్థానం ఏమిటో అర్థం చేసుకున్నాడు. చైనాలో తైపింగ్ తిరుగుబాటు, భారతదేశంలో సిపాయి తిరుగుబాటు (భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం),అమెరికాలో బ్లాక్ రెసిస్టెన్స్ తరువాత ఆయన రాసిన రచనలు భారతదేశంలో ప్రజాస్వామ్య విప్లవం యొక్క అత్యవసర అవసరం గురించి మాట్లాడేలా చేశాయి. మార్క్స్ వాడిన “ప్రజాస్వామ్య విప్లవం” అనే పదం కుల వ్యవస్థను రద్దు చేసే అవకాశాలను కలిగి ఉంది.
కొత్త ప్రపంచం కోసం జరిగిన తాత్విక ప్రక్రియలో మార్క్సిజం ఒక విప్లవాత్మక సిద్ధాంతంగా, విజ్ఞాన శాస్త్రంగా ఉద్భవించింది. లెనిన్ ఎత్తి చూపిన విధంగా మార్క్సిజం మూడు సమగ్ర భాగాలలో ఒకటి, గతితార్కిక భౌతికవాదం (చారిత్రక భౌతికవాదం), రెండు, మిగులు విలువ సిద్ధాంతం, మూడు, చరిత్ర చోదక శక్తిగా వర్గ పోరాటం సిద్ధాంతం.
రాజకీయ అధికార సాధనకు తీవ్రస్థాయి వర్గ పోరాటాలకు రాబోవు కాలం సాక్ష్యం కానుంది. తద్వారా ప్రభుత్వ పౌరులందరికీ గృహ, ఆరోగ్య సంరక్షణ, విద్య , జీవనోపాధిని అందించే ఒక కొత్త సామాజిక క్రమం ఉద్భవిస్తుంది. తద్వారా పౌరులందరికీ సమానత్వం, న్యాయం, గౌరవం చేకూరుతుంది.
డి.రాజా, సిపిఐ ప్రధాన కార్యదర్శి
(కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా గత మే 5 న ఈ వ్యాసం రాశారు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here