శ్రావణి కేసులో కీలక ట్విస్ట్

0
104

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రావణి మృతికి దేవరాజ్ రెడ్డి వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆర్‌ఎక్స్‌100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి- శ్రావణి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీకైంది. తనను వేధిస్తున్న దేవరాజ్ పై శ్రావణి కేసు పెట్టిన సమయంలో ఈ సంభాషణ జరిగినట్లు తెలిసింది.

శ్రావణిని వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ కు సంబంధించిన లీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. టిక్‌టాక్‌లో అమ్మాయిలను ఫ్రెండ్స్‌ చేసుకునేవాడని, వారితో స్నేహం పెంచుకుని, డబ్బు వసూలు చేసేవాడని అతడిపై శ్రావణి గతంలో ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రేమించి, మొహం చాటేయడంతో మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు, ఆత్మహత్యకు పాల్పడిన శ్రావణి అంత్యక్రియలు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో నిర్వహించారు. గొల్లప్రోలు స్మశాన వాటికలో హిందూ సాంప్రదాయ ప్రకారం తన తండ్రి చేతుల మీదుగా శ్రావణి అంత్యక్రియలు జరిగాయి. శ్రావణికి బంధువులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. మనసుమమత, మౌనరాగం వంటి సీరయళ్లతో పాపులర్ అయిన శ్రావణి ఎస్‌ఆర్‌నగర్‌లోని మధురానగర్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here