దక్షిణాది నిర్మాత ఓ రాత్రి గడపమన్నాడు..

0
9022

ప్రముఖ బాలీవుడ్ నటి ..దర్శకురాలు నీనా గుప్తా ఆత్మకథ “సచ్ కహు తో” సంచలనం రేపుతోంది. అందులో ఆమె ఎన్నో షాకింగ్ విషయాలను ప్రస్తావించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆత్మకథ ఆమె తన జీవితం గురించి నిజాయితీగా చెప్పే కథ. పెళ్లి కాని తల్లి దగ్గర నుంచి బాలివుడ్ లో విజయవంతంగా నిలదొక్కుకునే వరకు ఎదురైన అనుభవాలు.. సంఘటనలు ఇందులొో పొందుపరిచారు. స్టింగ్ కౌచ్ నుంచి బాలీవుడ్ రాజకీయాల వరకు…అన్నీ ఉంటాయి.

నీనా గుప్తా స్వయంగా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారు. అప్పట్లో ఓ ప్రముఖ దక్షిణాది నిర్మాత నుంచి ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. పలువురు కొత్త తారలను వెండితెరకు పరిచయం చేసిన ఘనడుగా సదరు దక్షిణాది నిర్మాతకు పేరుంది. కానీ ఆయన పేరు మాత్రం చెప్పలేదు నీనా..కాని అప్పట్లో అలాంటి దక్షిణాది నిర్మాతలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అలాటి ఒకరిద్దరు తెలుగు నిర్మాతలు కూడా అప్పట్లో బాలీవుడ్ లో వరఃస పెట్టి సినిమాలు తీశారు. ఆ నిర్మాత ఇప్పుడు జీవించి ఉన్నారో లేదో కూడా తెలియదు. ఇక అసలు సంగతికి వస్తే..

ముంబైలోని పృథ్వీ థియేటర్‌కు దగ్గరలో ఉన్న తన హోటల్‌కు నీనాని రమ్మన్నాడాయన. దాంతో ఆమె లాబీలో ఆయన కోసం ఎదురుచూసింది. కానీ పైన గదికి రమ్మన్నాడు. అప్పుడే ఆమెకు డౌట్ వచ్చింది. వెళ్లాలా వద్దా అని సంకోచిస్తూనే వెళ్లింది. ఓ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి వేశం కోసం పిలిపించాడు. ఆ విషయం చెప్పగానే ..ఇక వెళతాను అని చెప్పి బయలుదేరబోయింది. దాంతో అతడు షాక్ తిన్నట్టు ఫేస్ పెట్టి ..ఎక్కడికి వెళతావు? రాత్రికి ఇక్కడ గడపట్లేదా అన్నాడు. నీనా మైండ్ బ్లాంక్ అయింది. బకెట్ ఐస్ వాటర్ ని నెత్తిన కుమ్మరిస్తే ఎలా ఉంటుందో అలా .. రక్తం గడ్డుకట్టుకుపోయిందని నీనా గుప్తా ఆ చేదు అనుభవం గురించి వివరించారు. కానీ ఆయన బలవంతం ఏమీ చేయకపోవటంతో బ్యాగ్ తీసుకుకుని అక్కడి నుంచి జారుకుంది.

నీనా ఆత్మకథను కరీనా కపూర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టా వీడియో చాట్ లో మాట్లాడారామె. 20 ఏళ్లుగా ఆత్మకథ రాస్తున్నానని, తన గురించి తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపిస్తారన్న నీనా ఎన్నో ఏళ్లుగా దాచిపెట్టిన విషయాలను ఇలా వెల్లడించటం పెద్ద ఉపశమనమని అన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్‌ఎస్‌డి) నుంచి 80 వ దశకంలో కెరీర్ కోసం బాంబే (ఇప్పుడు ముంబాయి) లో్ అడుగు పెట్టింది. మొదట చిన్నా చితకా పాత్రలే వచ్చాయి. కానీ ఆమె తన బోల్డ్ నేచర్ తో బాలీవుడ్ న్యూస్ ఐటెమ్ గా ఉండేది. అప్పట్లో వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మన్ వివియన్ రిచర్డ్స్ తో రొమాన్స్ ..అతనితో సహజీవనం..పెళ్లి కాకుండానే బిడ్డను కనటం నీనాను ఎప్పుడూ వార్తల్లో ఉంచేది. నీనా తన యాబై ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవటం విశేషం. ఓ సినిమాకు ఏం కావాలో అవన్నీ నీనా గుప్త జీవితంలో ఉన్నాయని ఆమె ఆత్మకథను చదివితే అర్థమవుతుంది.