సుశాంత్ కేసులో కీలక మలుపు…సిస్టర్స్ పై కేసు నమోదు..

23
192

వాట్సాప్‌లో చట్టబద్దంగా సూచించలేని మందుల కోసం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరీమణులు “బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్” తయారు చేశారని రియా చక్రవర్తి ఆరోపించిన ఒక రోజు తర్వాత, ముంబయి పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు కోసంఈ కేసును సిబిఐకి బదిలీ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. రాజ్‌పుత్ సోదరీమణులు ప్రియాంక సింగ్, మీతు సింగ్, ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి డాక్టర్ తరుణ్ తదితరులసై కేసు నమోదైంది.నటి రియా చక్రవర్తి సోమవారం సుశాంత్‌ సోదరి ప్రియాంక సింగ్‌ ఫోర్జరీ పాల్పడ్డారని పేర్కొంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్‌ మరణానికి కేవలం ఐదు రోజుల ముందు ఢిల్లీలోని రాం మనోహర్‌ లోహియా దవాఖాన వైద్యుడు డాక్టర్‌ తరుణ్‌కుమార్‌ నిషేధిత మందుల ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చారని రియా ఆరోపించారు. ప్రియాంక సింగ్‌ ‘బోగస్‌ మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌’ తీసుకొచ్చారని ఆరోపించారు. చట్టవిరుద్ధ మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ ఎలా ఇచ్చారన్న విషయమై అవసరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు సీబీఐ అధికారుల ముందు వరుసగా మూడో రోజు రియా చక్రవర్తి విచారణకు హాజరయ్యారు.