నా ముంబై ఇప్పుడు పీవోకే, పాకిస్తాన్

0
130

మహా సర్కార్ తో కంగనా రనౌత్ సై అంటే సై అంటోంది. బ్రుహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఆమె ఇంటిని కూలగొట్టే పని ప్రారంభించటంతో కంగన మరింత రచ్చి పోయి మాటల యుద్ధానికి దిగింది. కూల్చివేతపై స్పందిస్తూ .. నా ముంబై ఇప్పుడు పీవోకే, పాకిస్తాన్ ..అంటూ తాజాగా ట్వీట్ చేసి మహాసర్కార్ కు ఏ మాత్రం తగ్గేది లేదన్న సందేశం ఇచ్చింది.

ముంబై పాలిహిల్స్ లోని ఆమె బంగళాలో అనధికార నిర్మాణాలు చేపట్టారని ఆమెకు కార్పోరేషన్ ఇప్పటికే నోటీసులు అందించింది. ఇవాళ ఉదయం తమను సంప్రదించాలని కార్పోరేషన్ ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆమె నుంచి స్పందన లేకపోవటంతో అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చే పని ప్రారంభించారు. తన ఇంటిని కూల్చుతున్న విజువల్ప్ ను ఆమె తన ట్విటర్ లో పోస్ట్ చేసింది.

శివసేనతో తాను చేస్తున్న పోరాటం వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని, అంతేగాక బీఎంసీని కూడా శివసేన నియంత్రిస్తోందని 33ఏళ్ల కంగన ఆరోపించారు. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నా శత్రువులు దీనిని మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారు, అందుకే నా ముంబై ఇప్పుడు పీఓకే #deathofdemocracy” అని కంగనా రనౌత్ వరుస ట్వీట్లలో రాశారు. “పాకిస్తాన్ …” “బాబర్, అతని ఫ్యామిలీ ” అని కూడా ట్విటర్ లో రాసుకొచ్చారు కంగన.

ముంబైలోని పాలి హిల్స్‌లోని ఆమె కార్యాలయంలో 14 ఉల్లంఘనలపై బిఎంసి నోటీసులో ఇచ్చింది. కంగనకు చెందిన బాంద్రా బంగ్లాలో చేసిన అక్రమ మార్పులను కూడా పడగొడతారని కార్పోరేషన్ అదికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు చెప్నారు.
“నేను విమానాశ్రయానికి వెళ్ళేటప్పుడు ముంబై దర్శన్ కోసం సిద్ధంగా ఉన్నాను. మహారాష్ట్ర ప్రభుత్వం , వారి గూండాలు నా ఆస్తి ఇంటి వద్ద ఉన్నారు, చట్టవిరుద్ధంగా దానిని విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు…మీ పని కొనసాగండి! మహారాష్ట్ర గౌరవం కోసం రక్తం ఇస్తానని వాగ్దానం చేశాను. నా నుంచి మీరు ఏమీ తీసుకోరు.. నా ఆత్మ విశ్వాసం మరింత ఎత్తుకు పెరుగుతుంది “అని ఆమె ఈ ఉదయం ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here