వ్యవసాయ బిల్లుతో హర్యానాలో బీజేపీ పీఠం కదులుతుందా.?

0
121

కేంద్రం తీసుకొస్తున్న వ్యవసాయ రంగ సంస్కరణలపై పలు రాష్ర్టాలలో రైతు లోకం మండిపడుతోంది. వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావించిన వ్యవసాయ బిల్లు 2020 కు ఎన్టీఏ మిత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ మూడు బిల్లులను రైతు వ్యతిరేక బిల్లుగా అభివర్ణిస్తూ శిరోమణి అకాలీదళ్ కు చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ బిల్లును వ్యతిరేకించాయి. దాంతో పంజాబ్ పొరుగున్న ఉన్నా హర్యానాలో కూడా రాజకీయం వేడెక్కింది.

ప్రస్తుతం హర్యానాలో బీజేపీ, జేజేపీ కూటమి సర్కార్ ఉంది. జననాయక్ జనశక్తి పార్టీ (జేజేపీ) అధ్యక్షు డు దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని పార్టీ నుంచి తీవ్ర వొత్తిడి వస్తొంది.పార్టీకి చెందిన ఎమ్మెల్యే దేవేందర్ బబ్లీ దుష్యంత్ పై బాహాటంగానే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా దుష్యంత్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవికి దుష్యంత్ రాజీనామా చేస్తారా? లేదా? అన్న ఉత్కంఠత నెలకొంది.

పంజాబ్, హర్యానాకు రైతు రాష్ట్రాలుగా పేరు. అకాళీదళ్‌ కు, జేజేపీకి రైతుల ఓటు బ్యాంకు గణనీయంగా ఉంది. బాదల్, చౌతాలా కుటుంబాలకు వ్యక్తిగతంగా రైతులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేప ధ్యంలో బీజేపీ కూటమి నుంచి బయటికి వచ్చేయాలంటూ దుష్యంత్ పై అకాలీ దళ్ కూడా ఒత్తిడి తెస్తు న్నట్లు సమాచారం. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లును దుష్యంత్ మొదట్లో వ్యతిరేకించారు. పార్లమెంట్ లో మాత్రం దుష్యంత్ వ్యవసాయ బిల్లును వ్యతిరేకించలేదు. అయితే పార్టీలో మాత్రం దుష్యంత్ పై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు సమాచారం.

కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ పంజాబ్‌లోని కురుక్షేత్ర ప్రాంతంలో రైతులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో హర్యానాలో ఒక్క సారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. లాఠీచార్జ్ పై విచారణకు ఆదేశించామని దుష్యంత్ స్వయంగా ప్రకటించారు. రైతులకు క్షమాపణలు కూడా తెలిపారు. అయినా సరే… అక్కడి వాతావరణం ఇంకా వేడిగానే ఉందని పార్టీ నేతలు అంటున్నారు. తాజాగా అకాలీ దళ్ కేంద్ర మంత్రివర్గం నుంచి బయటికి రావటం దుష్యంత్ చౌతాలా ఇరకాటంలో పడేసింది. డిప్యూటీ సీఎం పదవికి దుష్యంత్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్, అకాలీదళ్ ఒత్తిడి పెంచుతున్నాయిు.

దుష్యంత్ కుటుంబానికి రైతులతో పురాతన అనుబంధం ఉంది. జననాయక్ జనశక్తి పార్టీ (జేజేపీ) అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా మాజీ ఉప ప్రధాని దేవీలాల్ రాజకీయ వారసుడు. దేవీలాల్ కు గొప్ప రైతు నేతగా పేరుంది. రైతు నాయకుడుగానే ఆయన రాజకీయాల్లో ఎదిగారు. జేజేపీలో జననాయక్ అంటే దేవీలాలే. అలాంటిది , ఇప్పుడు రైతు వ్యతిరేకమని బావిస్తున్న బిల్లులు తీసుకొస్తున్న బీజేపీ తో ఎలా కలిసినడుస్తారు. ఇది దుష్యంత్ ని ఇరుకున పెట్టే అంశం. దుష్యంత్ బీజేపీని వీడినా రాజకీయంగా ఆయనకు వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. పైగా బీజేపీ రైతు ఓటు బ్యాంకు కు గండికొట్టొచ్చు.

దుష్యంత్ మద్దతు ఉపసంహరిస్తే హర్యానాలో బీజేపీ సర్కార్ కూలిపోయినా కూలిపోవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్, ఇతరులతో తో కలిసి మళ్లీ సర్కార్ ను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. మళ్లీ ఉప ముఖ్యమంత్రి పోస్ట్ దక్కొచ్చు..ఏకంగా సీఎం పదవి వచ్చినా ఆశ్చర్యంలేదు. ప్రస్తుత హర్యానా అసెంబ్లీలో 90 సీట్లకు గాను బీజేపీకి 40 స్థానాలు, జేజేపీ 10, ఇండిపెండెంట్లు 6, కాంగ్రెస్ 30 ఇతరులు3, కాగా ఒక స్థానం ఖాలీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here