ఈ గొర్రె ధర రూ.3.5 కోట్లు

0
77

కొన్ని వార్తలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. చెప్పినా నమ్మ బుద్దికాదు.ఇదీ లాంటిదే. మనకు తెలి సి నంత వరకు ఓ గొర్రెపోతు ఖరీదు ఎంత ఉంటుంది. ఏడెనిమిది వేలు లేద ఓ పది పన్నెండు వేలు. అంతేగాని లక్షలు కోట్లలో ఉంటుందని ఎవరైనా అను కుకుంటారా. కాని ఈ గొర్రె ఖరీదు అక్షరాలా మూడున్నర కోట్లు. నమ్మటం కొంచెం కష్టమే కానీ నమ్మాలి. ఈ గొర్రెపిల్ల వేలంలో ఏకంగా రూ.3.5 కోట్లకు అమ్ముడుపోయి ఆశ్చర్యంలో ముంచెత్తింది.’డబుల్‌ డైమండ్‌’ అనే 6 నెలల ఈ గొర్రెపిల్ల స్కాట్లాండ్ ‌లోని గ్లాస్గోలో టెక్సెల్‌ జాతికి చెందినది. యూకేలోని చెషైర్‌లోని మాక్లెస్ఫీల్డ్‌లో పుట్టి, పెరిగిన ఈ గొర్రెపిల్లను ముగ్గురు వ్యాపారులు కలిసి రూ.3.5 కోట్లకు దక్కించు కున్నా రు. టెక్సెల్‌ జాతికి చెందిన ఇలాంటి ప్రత్యేకమైన గొర్రెల మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అలాగే, వీటి ఉన్నికి డిమాండ్‌ ఎక్కువ. 2009లో ఓ గొర్రె రూ.2.2 కోట్లకు అమ్ముడుపోయింది. దాని రికార్డును ‘డబుల్‌ డైమండ్‌’ బద్దలుకొట్టింది
ప్రతి సంవత్సరం ఇలాంటి వేలం జరుగుతుంది. రకరకాల జాతుల జంతువుల్ని అమ్ముతారు. డబుల్ డైమండ్ గొర్రెను ముగ్గురు వ్యాపారులు కలిసి కొనుక్కున్నారు. వారిలో ఒకరైన జెఫ్ అయికెన్… అంత ఎక్కువ రేటు పెట్టుకొనుక్కున్నందుకు ఏమాత్రం ఫీలవ్వట్లేదనీ… చాలా ఆనందపడుతున్నాననీ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here