నిత్యానందుని కొత్త ఫ్యాన్..

3919
19488

అందరిది ఒక రూటైతే..ఆమెది ఇంకో రూట్.. తన రూటే సెపరేట్ అంటూ ఇటీవల తమిళ పరిశ్రమలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె దృష్టి తాజాగా వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై పడింది. నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నానని తాజాగా ట్విటర్ లో ప్రకటించారు. నిత్యానంద తనే సొంతంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇప్పుడు నటి మీరామిథున్‌ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. అందరూ ఆయన్ని తప్పుగా ప్రచారం చేశారు. త్వరలో తాను నిత్యానంద ఏర్పాటుచేసిన కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌ అని మీరా మిథున్‌ పేర్కొంది.


వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి…
మీరా మిథున్ పేరు కొంత కాలం నుంచి తమిళ మీడియాలో బాగా వినిపిస్తోంది. మోడల్, నటి, హీరోయిన్, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్‌గా రాని పేరు.. సోషల్ మీడియా ద్వారా వస్తోంది. త్రిష తనను కాపీ కొడుతోందని, తన క్యాస్టూమ్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ ఇలా అన్నింటిని త్రిష కాపీ కొడుతుందని ఇకపై ఊరుకునేది లేదని కొద్ది రోజుల క్రితం వరుస ట్వీట్లు చేసింది. అయితే వాటిని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. దాంతో ఇంకాస్త డోసు పెంచి స్టార్ హీరోలను టార్గెట్ చేసింది.


ఎవరినీ వదలట్లేదు…
వారం క్రితం మీరా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది. హీరో విశాల్ తనను పెళ్లి చేసుకుంటానని రెండు, మూడేళ్ళుగా వెంటపడ్డాడని తెలిపింది. త‌న త‌ల్లికి విశాల్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, కానీ అత‌న్ని వివాహం చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని కామెంట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై కోలీవుడ్ పెద్దలు సైతం కోపంగా ఉన్నట్టు సమాచారం.
గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్ హీరోలపై ఆమె బండ బుతులతో రెచ్చిపోతున్న విధానం అందరిని షాక్ కి గురి చేస్తోంది. విజయ్, సూర్యల పర్సనల్ విషయాలపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. తమిళ హీరోలు నెపోటిజం కిడ్స్ అని, ఫ్యాన్స్‌ను కూడా కంట్రోల్ చేసుకోలేరని తీవ్రస్థాయిలో తిట్టింది. ఐతే, తమిళనాడులో హీరోల పట్ల గల అభిమానం డోస్ దేశంలో మరెక్కడా కనిపించడు. తమ హీరోలను దాదాపు దైవం అనేలా ప్రేమిస్తారు. వారి హీరోపై ఎవరైనా కామేంట్స్ చేస్తే మాత్రం రోడ్డెక్కి రచ్చ చేస్తారు. ఇందుకు గతంలో కూడా ఎన్నో ఉదాహరణలున్నాయి. ఏదైతేనేమి, మీరా మిథున్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆమెపై మండిపడుతున్నారు. మొత్తానికి మీరా మిథున్ అటెన్షన్ కోసం వేసిన ఎత్తుగడలు ఫలించాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కోలీవుడ్ ఫైర్
కస్తూరీ, మీరా మిథున్‌లు బిగ్ బాస్ మూడో సీజన్‌లో తోటి కంటెస్టెంట్లుగా ఉన్నారు. మీరా మిథున్ హద్దులు మీరి చేస్తున్న కామెంట్లపై కస్తూరీ ఫైర్ అయింది. నెపోటిజం, క్యాంప్స్ మాఫియా లాంటి ఎంటర్ కానీ ఒకే ఒక ఇండస్ట్రీ కోలీవుడ్ అని అంతా కష్టపడి పైకి వచ్చారన్నారు కస్తూరి. తమిళ పరిశ్రమలో సక్సెస్ కావాలంటే కఠోర శ్రమతో పాటు కాస్తఅదృష్టం కలిసిరావలి అంతే.. ఇదే అందరికీ వర్తిస్తుందని చెప్పారు. విజయ్, సూర్య, కార్తీ, జయం రవి లాంటి హార్డ్ వర్క్ చేసే అద్భుతమైన నటులు కోలీవుడ్‌లో సక్సెస్ సాధించారే తప్ప వారి తండ్రుల పేరుతో కాదని అన్నారు. అజిత్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్ వంటి వారు అద్భుతమైన నటులుగా ఎదిగారని ఉదహరించారామె.కేవలం ప్రతిభ లేని వారే అలా ఊహించుకుంటారు.. నెపోటిజం ఉందని వారికి నచ్చినట్టుగా ఊహలు అల్లేసుకుంటార’ని కస్తూరీ ఫైర్ అయింది.


నిత్యానందకు నిత్యం ఆనందమే…
మీరా కథ ఇలా వుంటే.. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కూడా కొంతకాలంగా సంచలనంగా మారారు. ఈక్వేడార్ లో ద్వీపం కొనుగోలు చేసి దానికి ‘కైలాస దేశం’లో అని పేరు పెట్టారు. అంతేకాదు ఇటీవలే రిజర్వ్‌ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా.. ఈ కరెన్సీ చెల్లుబాటయ్యేలా ఇందుకు సంబంధించి వివిధ దేశాలతో పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఒక మనిషి ఒక కంపెనీ స్థాపించడం గురించి విన్నాం. కానీ నిత్యానంద ఏకంగా ఒక దేశాన్ని స్థాపించాడు. ఆశ్రమంలో అమ్మాయిలపై అత్యాచారం నేరారోపణల కేసు తర్వాత రాసలీలల సాములోరు దేశం విడిచి పారిపోయాడు. అయితే ఈ స్వామీజీ తన సొంత దీవిలో సేద దీరుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో అంతా ఆశ్యర్యపోయారు. వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో నిత్యానంద కొత్త దేశం అనే డ్రామా మొదలు పెట్టాడు.

నిత్యానంద గురించి ఇన్ని విషయాలు తెలిసినా ఇప్పటికీ ఆయన పట్ల కొందరు అభిమానం ప్రదర్శిస్తున్నారంటే ఆశ్యర్యమే మరి. అయితే నిత్యానందుని కొత్త డ్రామా ఎంతకాలం నడుస్తుందో చూడాలి.

3919 COMMENTS


    Fatal error: Allowed memory size of 134217728 bytes exhausted (tried to allocate 7086080 bytes) in /home/n8rpctrj1kcp/public_html/wp-includes/comment-template.php on line 2230