గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తాను అనని మాటలను కూడా అన్నట్టు మీడియా రిపోర్ట్ చేసిందని మున్పిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై ఆయన కొద్ది సేపటి క్రితం ట్విటర్ లో వివరణ ఇచ్చారు.
నవంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండవ వారం తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ మరియు నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమీషన్ పరిధిలోని అంశం. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది.