ఒఎన్‌జిసి సూరత్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్లాం ట్ లో మూడు పేలుళ్లు సంభవించినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సూరత్‌లోని హజీరా కేంద్రంగా పనిచేస్తున్న ఒఎన్‌జిసి ప్లాంట్‌లోని రెండు టెర్మినల్స్ వద్ద ఈ తెల్లవారుజామున 3:30 గంటల కు వరుసగా మూడు పేలుళ్లు జరిగాయి.
పేలుడు వల్ల ప్లాంట్ లో భారీగా మంటలు ఎగిసాయి. ఇదిలావుంటే, గుజరాత్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఈ తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదం అదుపులోకి వచ్చిందని కంపెనీ తెలిపింది. “ఏ వ్యక్తికి ఎటువంటి ప్రమాదం కానీ గాయాలు కాని కాలేదు. ” అని ఒఎన్‌జిసి తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.
పేలుడు శబ్దం 10 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. 36 అంగుళాల యురాన్-ముంబై గ్యాస్ పైప్‌లైన్‌లో చీలిక కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ముందు జాగ్ర్తత్తగా అన్ని టెర్మినల్‌లను మూసివేశారు.