14ఏళ్ల బాలుడ్ని లైంగికంగా వేధించిన వ్యక్తి అరెస్ట్‌!

1
129

ఓ వ్యక్తి 14 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించి కటకటాలపాలైన ఘటన దుబాయిలో జరిగింది. యూరప్‌కు చెందిన 14ఏళ్ల బాలుడు.. బుర్‌ దుబారులో ప్రాంతంతో తన తండ్రితో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో బాత్‌రూంలో రిపేర్‌ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి.. గదిలో ఒంటరిగా ఉన్న బాలుడితో అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించాడు. దీంతో భయాందోళనకు గురైన సదరు బాలుడు.. గట్టిగా కేకలు వేశాడు. కొడుకు కేకలు విని అక్కడకు చేరుకున్న తండ్రి.. జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ తండ్రి.. తన కొడుకును లైంగికంగా వేధించిన వ్యక్తిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు వ్యక్తిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేసింది. సెప్టెంబర్‌ 15న తీర్పు వెల్లడించనున్నట్లు ప్రకటించింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here