ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) మరణంతో సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలు ఇవాళ మద్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణం పట్ల ప్రపంచం నలుమూలల నుంచి సంతాప సందేశాలు వస్తున్నాయి.
స్.పి.బాలసుబ్రహ్మణ్యం మృతికి సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో మహేశ్ బాలసుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఆయనలాంటి వాయిస్ ఎవరికీ ఉండదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన లెగసీ అమరం. ఆయన కుటుంబానికి నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను” అన్నారు మహేశ్.