91 వ వసంతంలో అడుగుపెట్టిన గాన కోకిల

0
163

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ 91వ ఏట ఆడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు జన్మదిన శూశాకాంక్షలు తెలిపారు. ఎప్పుడూ ఆమె ఆశీస్సులు, ప్రేమాభిమానాలు పొందడం తన అదృష్టంగా భావిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘లతా దీదీతో మాట్లాడాను. ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాను. భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా వేడుకుంటున్నాను. దేశంలోని ఇంటిల్లిపాదికీ లతా దీదీ పేరు సుపరిచితమే. ఎల్లప్పుడు ఆమె ప్రేమాభిమానాలు, ఆశీర్వాదం లభించడం వ్యక్తిగతంగా నా అదృష్టంగా భావిస్తున్నాను…’’ అని మోదీ ట్వీట్ చేశారు.

https://twitter.com/narendramodi/status/1310442419465252866


లతా జన్మదినం సందర్భంగా ప్రముఖ నటి కంగనా రనౌత్ తన ట్విటర్ ఖాతాలో ఆమె త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేసుకున్నారు. ‘‘కొందరు కేవలం తమ సామర్థ్యాన్ని నమ్ముకుని ఏ పనిచేసినా ఏకభావంతో చేస్తారు. అలాగే వారు చేసిన పనికి తామే మారుపేరుగా నిలుస్తారు. అలాంటి కర్మ యోగికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..’’ అని కంగన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో లతా మంగేష్కర్‌కు సైకత శిల్పాన్ని రూపొందించి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు.

https://twitter.com/KanganaTeam/status/1310443488853372928

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here