కోహ్లీ ప్రొమోషన్ కొట్టేశాడు… ఓ పనై పోయింది..

0
49

విరాట్ కోహ్లీ ఇప్పటికే టీమిండియా కెప్టెన్..ఇంకా ప్రమోషన్ ఏమిటని అనుకుంటున్నారా? నిజమే కానీ ఆయనకు ప్రమోషన్ వచ్చింది క్రికెట్ లో కాదు.. తన కాపురంలో. త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయం ఆయనే ట్విటర్ లో ప్రకటించాడు . ఇప్పటి వరకు మేము ఇద్దరం త్వరలో ముగ్గురం కాబోతున్నాం.. . 2021లో కొత్త వ్యక్తి రాబోతున్నాడు అంటూ ట్వీట్ చేశారు. జనవరిలో అనుష్క డెలివరీ కాబోతున్నట్లు ప్రకటించేశాడు.గర్భంతో ఉన్న భార్యతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ కు జత చేసి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు.


పుత్రోత్సాహం అనుభవిస్తున్నా..
ప్రస్తుతం నా భార్య గర్భవతి..త్వరలోనే మా ఇంట్లోకి మూడో వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు.. అది అబ్బాయా లేక అమ్మాయా అనే విషయం పక్కనపెడితే.. ఇప్పుడు నేను పుత్రోత్సాహం అనుభవిస్తున్నా.. మా ఆరేళ్ల రిలేషిన్‌షిప్‌లో ది మోస్ట్‌ మొమరబుల్‌ మూమెంట్‌ ఇదే.. అంటూ పేర్కొన్నాడు. కాగా ట్విటర్‌లో విరాట్‌ తన భార్య అనుష్క శర్మతో లేటెస్ట్‌గా దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 2013 నుంచి రిలేషిన్‌షిప్‌లో విరుష్క జోడి.. 2017లో ఇటలీలో జరిగిన పెళ్లితో వైవాహిక జీవితం ప్రారంభించారు.


మే నెల నుంచి దాచి పెట్టారు..
తాను తండ్రి కాబోతున్న విషయాన్ని మే నెల నుంచి రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జవవరి 1న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హార్దిక్ పాండ్యా.. మే 31న తన భార్య గర్భవతి అని ప్రకటించగానే.. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ జోడీపై పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. 2017, డిసెంబరు 11న బాలీవుడ్ నటి అనుష్క శర్మని వివాహం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇంకా ఎన్ని రోజులు శుభవార్త కోసం తాము వెయిట్ చేయాలంటూ..? అభిమానులు కోహ్లీని అడిగారు. కానీ.. విరుష్క జోడీ మాత్రం మౌనంగా ఉండిపోయింది.


డెలివరీ టైమ్ లో ఆస్ట్రేలియాలో…?
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు ప్రస్తుతం యూఏఈకి వెళ్లిన విరాట్ కోహ్లీ బుధవారమే ఆరు రోజుల క్వారంటైన్‌ని పూర్తి చేసుకున్నాడు. గురువారం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ప్రాక్టీస్ మొదలుపెట్టనుండగా.. ఈసారి ఆర్సీబీకి టైటిల్‌ని అందించాలనే పట్టుదలతో కోహ్లీ ఉన్నట్లు కనిపిస్తోంది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. యూఏఈ నుంచి అలానే ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న టీమిండియా.. జనవరి చివరి వారంలో మళ్లీ భారత్‌కి రానుంది. ఈ లెక్కన అనుష్క శర్మ డెలివరీ టైమ్‌లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్‌లో ఉండే అవకాశం ఉంది. అప్పట్లో మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ కూడా తమ భార్యలు డెలివరీ సమయంలో ఆస్ట్రేలియా టూర్‌లోనే ఉన్నారు.
మొత్తానికి కరోనా కాలంలో కోహ్లీ ..అనుష్క ఓ పని పూర్తిచేశారు..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here