అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ అధ్వాన్నం ..

1
209

96.2 శాతం అక్షరాస్యతతో కేరళ మరోసారి దేశంలో అత్యంత అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా అవతరించింది, ఆంధ్రప్రదేశ్ 66.4 శాతంతో అట్టడుగున నిలిచింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సర్వే నివేదిక ఈ విషయం వెల్లడించింది. గృహ సామాజిక వినియోగం 75 వ రౌండ్‌ జాతీయ శాంపుల్ సర్వే భారతదేశంలో అక్షరాస్యత పై జూలై 2017 నుండి జూన్ 2018 మధ్య సర్వే జరిపింది. ఇందులో ఏడు సంవత్సరాలు పైబడిన వారిని పరిగణలోకీ తీఃసుకున్నారు. ఈ నివేదిక ప్రకారం మొదటి స్థానంలో కేరళ, తరువాత స్థానంలో ఢిల్లీ నిలిచింది. అక్కడ అక్షరాస్యత 88.7 శాతంగా ఉంది, ఉత్తరాఖండ్ 87.6 శాతం, హిమాచల్ ప్రదేశ్ 86.6 శాతం, అస్సాం 85.9 శాతం అక్షరాస్యత ఉన్నట్టు తేలింది. మరోవైపు, అక్షరాస్యత రేటు 69.7 శాతంతో రాజస్థాన్ దిగువ నుంచి రెండవ స్థానంలో ఉంది, బీహార్ 70.9 శాతం, తెలంగాణ 72.8 శాతం, ఉత్తర ప్రదేశ్ 73 శాతం, మధ్యప్రదేశ్ 73.7 శాతం ఉన్నాయి. మొత్తం మీద దేశం సగటు అక్షరాస్యత రేటు 77.7 శాతంగా ఉన్నట్టు అధ్యయనం చెబుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత 73.5 శాతంగా ఉండగా పట్టణ ప్రాంతాల్లో అది 87.7 శాతం. అఖిల భారత స్థాయిలో, పురుషుల అక్షరాస్యత రేటు మహిళల 70.3 శాతంతో పోలిస్తే 84.7 శాతంగా ఉంది. అన్ని రాష్ట్రాలలో పురుషుల అక్షరాస్యత రేటు స్త్రీ అక్షరాస్యత రేటు కంటే ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. కేరళలో పురుషుల అక్షరాస్యత 97.4 శాతం, మహిళల్లో 95.2 శాతం. అలాగే ఢిల్లీలో పురుషుల అక్షరాస్యత రేటు 93.7 శాతం, మహిళల్లో అది 82.4 శాతంగా ఉంది. అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కూడా స్త్రీ, పురుష అక్షరాస్యత రేటులో గణనీయమైన అంతరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల అక్షరాస్యత రేటు 73.4 శాతం ఉంటే ఆడవారిలో అది కేవలం 59.5 శాతం. రాజస్థాన్‌లో మరీ దారుణం . పురుషుల అక్షరాస్యత రేటు 80.8 శాతంగా ఉంటే మహిళల అక్షరాస్యత కేవలం 57.6 శాతం. బీహార్‌లో పురుషుల అక్షరాస్యత రేటు కూడా 79.7 శాతంగా ఉండగా ప్ర్తీలలో అది 60.5 శాతం . దేశ వ్యాప్తంగా 8,097 గ్రామాల నుంచి 64,519 కుటుంబాలు, 6,188 బ్లాకుల నుంచి 49,238 పట్టణ గృహాలను సర్వే చేశారు. దాదాపు 4 శాతం గ్రామీణ కుటుంబాలు, 23 శాతం పట్టణ కుటుంబాలు కంప్యూటర్ కలిగి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 15-29 సంవత్సరాల వయస్సు గల వారిలో, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 24 శాతం, పట్టణ ప్రాంతాల్లో 56 శాతం మంది కంప్యూటర్‌ను ఆపరేట్ చేయగలుగుతున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here