రాగిణీ ఓ రాగిణీ…వెళతావా జైలుకి..!

0
135

బాలీవుడ్ ..టీలీవుడ్ ..కోలివుడ్..ఇప్పుడు శాండల్ వుడ్ లు ఇప్పుడు డ్రగ్స్ వుడ్ గా మారిపోయినట్టు కనిపిప్తోంది. సుశాంత్ మరణంతో సినీ పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా అంశం తెరమీదకు రావటంతో పోలీసులు దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలపై ఫోకస్ పెట్టారు. తాజాగా, అక్రమ మాదకద్రవ్యాల (డ్రగ్స్‌) వినియోగం కేసు కన్నడ సినీ పరిశ్రమను హడలెత్తిస్తోంది. ప్రముఖ కన్నడ సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు మరో ఇద్దరిని బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు రాహుల్‌, వీరేన్‌ ఖన్నా అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాగిణికి అత్యంత సన్నిహితుడు, ఆర్టీవో కార్యాలయంలో క్లర్క్‌ రవిశంకర్‌ అలియాస్‌ రవిని గురువారమే పోలీసులు అరెస్ట్‌చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు నలుగరిని అరెస్టు చేసినట్లయ్యింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రాగిణి నివాసంలో బెంగళూరు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ (సీసీబీ) పోలీసు బృందం సోదాలు జరిపింది. తర్వాత ఆమెను అరెస్ట్‌చేసి సీసీబీ కార్యాలయానికి తరలించారు.


కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ తో ప్రమేయం ఉన్న వారిలో కనీసం పదిహేను మంది తనకు తెలుసని జర్నలిస్ట్, ఫిలిం మేకర్ ఇంద్రజిత్ లంకేష్ అంటున్నారు. డ్రగ్ మాఫియాతో పాటు క్రికెట్ బెట్టింగ్, అక్రమ డ్యాన్స్ బార్లు కాంట్రాబాండ్ డీలర్లు వచ్చిన డబ్బుతో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు వినియోగించాలరి కర్నాటక మాజీ ముఖ్యమంత్ర హెచ్ డీ కుమార స్వామి ఆరోపించారు దీంతో అధికార బీజేపీ, కుమార స్వామి మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here