మరోవైపు, ఈ సమయంలో కంగన ఇంటి కూల్చివేత చేపట్టి ఆమెకు అనవసర ప్రచారం కల్పిస్తున్నారి మహా సర్కార్ లో భాగస్వామిగా ఉన్నా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేత చట్టబద్ధం అయినా ఇప్పుడు ఆ పనికి దిగటం జననానికి తప్పుడు సంకేతాలిచ్చినట్టు అవుతుందని ఆయన అన్నారు. అసలు ఈ అంశానికి మీడియా ఎందుకు ఇంత ప్రచారం కల్పిస్తోందని..అది మంచిది కాదని శరద్ పవార్ అన్నారు.
పవార్ పార్టీకి చెందిన మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ కూడా కంగన వ్యాఖ్య లపై ఘాటుగానే స్పందించారు. అంతేకాదు, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కూడా కంగ నా రనౌత్ పేరు ప్రస్తావించకుండా పొట్టకూటి కోసం ముంబై వచ్చిన కొందరు కనీస కృతజ్ఞత లేనివారని అన్నారు.
కంగనా వ్యాఖ్యలపై మొదట్లోొ కొందరు బాలీవుడ్ తార లు పెదవి విప్పినా ఇప్పుడు అంతా కామ్ గా ఉన్నారు. వారి నోరు మూగబోయిం దేం అని కంగనా బాలీవుడ్ లో కొందరిపై ఘాటుగానే ప్రశ్నించారు. కంగన తీరు చూస్తుంటే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్లేదు. మరి ఇది ఎక్కడికి దారతీస్తుందో చూడిాలి.