కంగనకు 24 గంటలు గడువు…

0
83

ముంబయి బాంద్రాలోని పాలి హిల్ వద్ద ఇటీవల పునరుద్ధరించిన బంగ్లా ప్రాంగణం లో అక్రమ నిర్మాణాలు, అక్రమ మరమ్మత్తులు చేశారన్న ఆరోపణలకు 24 గంట్లో సమాధానం ఇవ్వాల్పిందిగా ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కంగనా రనౌత్ కు నోటీసు ఇచ్చింది.


కంగన ఇల్లు ఉన్న వరుసలో అనేక నిర్మాణాలున్నాయని. ఆమె దీనిని కార్యాల యంగా మార్చిందని, దీనిపై కంగనా 24 గంటల్లో అంటే ఇవాళ ఉదయం (బుధవారం ఉదయం) నోటీసుకు సమాధానం ఇవ్వాలని, అలా జరగని పక్షంలో బంగ్లాలోనిఅ అక్రమ భాగాన్ని కూల్చివేస్తుందని బిఎంసి అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.


బిఎంసీ కంగనకు పంపిన నోటీసులో పేర్కొన్న అనధికార నిర్మాణాల జాబితాలో ఇంటి మొదటి అంతస్థులోని టాయి్ లెట్ , కిచెన్, చిన్నగది ఉన్నాయి. వుడెన్ పార్టీషన్ ద్వారా మొదటి అంతస్తులో నిర్మించిన అనధికార గది, రెండవ అంతస్తు బాల్కనీని నివాసయోగ్యమైన ప్రదేశంలో అక్రమంగా చేర్చారని పేర్కొంది. బంగ్లాను ఇంతకు ముందు కిండర్ గార్టెన్‌గా ఉపయోగించారు. కంగనా కొన్నేళ్ల క్రితం దీనిని కొన్నారు. పునర్నిర్మాణం తరువాత, ఆమె బంగ్లాను ఆఫీస్-కమ్-హోం గా ఉపయోగించుకుంటున్నాని నిర్మాణం అనంతరం ఆమె రెసిడెన్స్ అసోసియేషన్ కు సమాచారం ఇచ్చింది.


బిఎంసీ చర్యతో అవాక్కైన కంగన “ఇప్పుడు బిఎంసి నాకు వ్యతిరేకంగా ఒక హెచ్చ రిక జారీ చేసింది. నా ఇంటిని కూల్చాలనే ఆత్రుతతో దానిలో కనిపిస్తోంది. ఎంతో అభిరుచితో ఏర్పాటు చేసుకున్న ఈ ఇల్లంటే నాకు చాలా ప్రేమ, కానీ మీరు దానిని విచ్ఛిన్నం చేసినా నా ఆత్మ మరింత బలపడుతుందని నాకు తెలుసు. ఏం చేసుకుంటారో చేసుకోండి…” అంటూ ట్వీట్ చేశారు. సివిక్ సిబ్బంది సోమవారం బంగ్లా తనిఖీ చేశారు.

ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ తో పోల్చుతూ కంగన పోస్ట్ చేసిన ట్వీట్లు రాష్ట్రంలో రాజకీయ వివాదం రేపటంతో కేంద్రం ఆమెకు వై-ప్లస్ భద్రత కల్పించింది. ఇది జరిగిన మరుసటి రోజే భిఎంసీ యాక్షన్ లోకి దిగింది.సుశాంత్ సింగ్ కేసు విషయంలో కంగన చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర పోలీసులకు వ్యతిరేకంగా ఉన్నాయి.

తనను నోటీసులు పంపేలా ఆ ప్రాంత వాసుల బీఎంసీని రాజకీయంగా ప్రేరేపించారని కంగన ఆరోపించారు. పాలి హిల్ రెసిడెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి మధు పోప్లై మాట్లాడుతూ, ప్రాంగణంలో నిర్మాణాల మార్పులు ఉంటే తప్పకూల్చివేత అవసరం లేదని. నగర ప్రజలు తమ ఇంట్లో మార్పులు చేర్చులు చేసుకోవటం సాధారణ విషయం.. బిఎంసీ చర్య తీసుకుంటే అందరిపైనా తీసుకోవాలన్నారు. ఇదిలావుంటే, కంగన ముంబయి రావటానికి ఒక రోజు ముందు ఆమె ఇంటి వద్ద సిఆర్పిఎఫ్ భద్రతను మోహరించిరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here