తీహార్ జైలులో మానసిక వేధింపులు..

0
97

శాన్య ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి యుఎపిఎ కింద అరెస్టయిన జామియా విద్యార్థి గుల్ఫిషా ఫాతిమాను ఢిల్లీలో కోర్టు లో హాజరు పరచారు. తిహార్ జైలు అధికారులు నుంచి తాను మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నానని ఆమె న్యాయస్థానానికి చెప్పారు.

అదనపు సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్‌తో, పింజ్రా టోడ్, నటాషా నార్వాల్, దేవంగన కలితల ముందు గల్ఫిషాను హాజరుపరిచారు. చార్జిషీట్ల సరఫరాపై న్యాయవాదులు చేసిన అభ్యర్ధనలను రావత్ పరిశీలిస్తున్న సమయంలో, తాను కోర్టుకు కొన్ని విషయాలు చెప్పటానికి అనుమతించాలని గల్ఫిషా అదనపు సెషన్స్ జడ్జిని ఉద్దేశించి అన్నారు.

“సర్, నాకు జైలులో సమస్య ఉంది… నిరంతం జైలు సిబ్బంది నుంచి వివక్షనుఎదుర్కొంటున్నాను. వారు నన్ను ‘చదువుకున్న ఉగ్రవాది’ అని పిలుస్తున్నారు. ‘మీరు బయట మీరు అల్లర్లు చేశారు…లోపల చనిపోతారు,’ అంటూ మానసికంగా వేదిస్తున్నారని అన్నారామె. నేను ఏదైనా చేసుకుంటే దానికి జైలు అధికారులు మాత్రమే దానికి బాధ్యత వహిస్తారు, ”అని ఆమెఅదనపు సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్‌కు చెప్పారు.

అయితే “మీ ఈ ఫిర్యాదు ఒక నిర్దిష్ట వ్యక్తిపై చేస్తున్నారా?” రావత్ గల్ఫిషా , ఆమె న్యాయవాది మెహ మూద్ ప్రాచాను ప్రశ్నించారు. దీనికి సంబంధించి దరఖాస్తు దాఖలు చేయాలని కోరారు. దాంతో న్యా యవాది ప్రాచా ఒక దరఖాస్తు చేసుకుంటానని కోర్టుకు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here