ఒకే ఒక్కడు ఆండర్సన్‌..600 టెస్ట్ వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్

0
49

మూడు వందలు కాదు నాలుుగు వందలు కాదు..ఏకంగా ఆరు వందల వికెట్లు. ఒకప్పుడు టెస్టుల్లో 300 వికెట్లు తీస్తే ఎంతో గొప్పగా హెడ్ లైన్లు పెట్టేవారు. కాని నేడు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్‌ ఆండర్సన్‌ టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు పడగొట్టిన ఏకైక పేసర్‌గా రికార్డు సృష్టించాడు. సౌతాంప్టన్ లో జరిగిన మూడవ టెస్టు చివరిరోజు ఆటలో పాక్‌ కెప్టెన్‌ అజర్‌ అలీ వికెట్‌ను పడగొట్టి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో ఆండర్సన్‌ నాలుగోవాడు. అతడికిది 156వ టెస్టు మ్యాచ్‌. టాప్‌-3లో ఉన్న మురళీధరన్‌ (800), షేన్‌ వార్న్‌ (708), అనిల్‌ కుంబ్లే (619) ముగ్గురూ స్పిన్నర్లు కావడం విశేషం. ఆసీస్‌ మాజీ పేసర్‌ మెక్‌గ్రాత్‌ (563) ఐదో స్థానంలో ఉన్నాడు.

2003లో అరంగేట్రం చేసిన ఆండర్సన్‌.. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ (2008)లో 19 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చాడు. అక్కడి నుంచి తనదైన స్వింగ్‌ బౌలింగ్‌తో జట్టుకు అండగా ఉంటున్నాడు. అలాగే ప్రతీ వంద వికెట్లకు కూడా అతడి సగటు తగ్గుతూ వస్తుండడం విశేషం. స్వదేశంలో ఆడిన 89 టెస్టుల్లో 384 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్‌.. తన కెరీర్‌లో ఓ జట్టుపై అత్యధిక (110) వికెట్లను భారత్‌పై తీయటం విశేషం. ప్రస్తుతం 38 ఏళ్ల ఆండర్సన్ మాటలను బట్టి ఇప్పుడప్పుడే రిటైర్ అయ్యేలా లేడు. తన ఫామ్ ఇలాగే కంటిన్యూ అయితే 700 వికెట్లు తీయగలనని ధీమా వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here