మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వం’ మరో బాహుబలి కానుందా..!

0
170
  • మణిరత్నం మల్టీ స్టారర్
  • విక్రమ్ , ఐ్వర్య రాయ్ , కార్తీ సహా పలువురు అగ్రతారలు
  • నెగెటివ్ రోల్ లో ఐశ్వర్యరాయ్..
  • అక్టోబర్ లో షూటింగ్ తిరిగి ప్రారంభం

ణిరత్నం సినిమా అంటే దేశం మొత్తం ఆసక్తి చూపుతుంది. విభిన్న కథాంశాలతో భారీ తారాగణంతో సినిమాలు రూపొందించటం మణిరత్నంకు అలవాటు. ఆయన ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు రూపొందించారు. ఆ కోవకు చెందినదే ‘పొన్నియిన్‌ సెల్వం’ . అమరర్ కల్కి రాసిన నవలను అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు మణి సార్.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ జనవరిలో విడుదలైంది. అప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మార్చిలో విధించిన లాక్ డౌన్ కారణంగా చిత్ర నిర్మాణం ఆగిపోయింది. అక్టోబర్ లో షూటింగ్ తిరిగి ప్రారంభమవుతున్నట్టు సమాచారం.ఈ చిత్రంలో నటుడు ప్రభు భార్యగా ఐశ్వర్యరాయ్ నటించనున్నారు. ఒక గ్రామానికి పెద్దగా ప్రభు పాత్ర టుంటుందని, అలాగే రాజరాజచోళుడుగా జయంరవి, వందియదేవన్‌ పాత్రలో కార్తీ నటిస్తున్నట్టు సమాచారం. మరో గ్రామ పెద్ద పాత్రగా నటుడు శరత్‌కుమార్‌ నటిస్తున్నారు సినీ వర్గాల బొగట్టా..

ఏమిటీ ‘పొన్నీయిన్‌ సెల్వం’ కథ…

తమిళ సాహిత్యకారుడు రామాస్వామి కృష్ణమూర్తి అలియాస్ అమరర్ కల్కి రాసిన నవల ఇది. చోళ రాజ్యం ఆధారంగా రచించిన కల్పిన గాథ. పొన్నీయిన్ సెల్వన్ అంటే పొన్నీ కుమారుడని అర్థం. ఈ చారిత్రక నవల 2210 పేజీలతో కూడిన ఐదు సంపుటాలు. ఇది అరుల్మోజివర్మన్ ప్రారంభ రోజుల కథను చెబుతుంది. తరువాత అతను గొప్ప చోళ చక్రవర్తి రాజరాజ చోళ I ఎలా అయ్యాడో వివరిస్తుంది.

ఈ నవల రాయడానికి అమరర్ కల్కికి మూడేళ్లు పట్టింది. రాయటానికి కావాల్సిన సమాచారం కోసం ఆయన మూడుసార్లు శ్రీలంకకు వెళ్లారు. పొన్నీయిన్ సెల్వన్ తమిళ సాహిత్యంలో గొప్ప నవలగా పరిగణిస్తారు. ఆయన నవలను నడిపించిన తీరు పాఠకులను కట్టిపడేస్తు్ది. అందుకే నేటికీ ఈ నవల బహుళ ప్రజాధరణ పొందుతోంది. చోళ సామ్రాజ్యం శక్తి , పోరాటం , కుట్రలను ఈ నవలలో కల్కి వర్ణించిన విధానం విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఈ నవలలో ఎన్నో పాత్రలున్నాయి.. అయితే మూడు ప్రధాన పాత్రల గురించి ఇక్కడ చెబుతాను..

వందియాదేవన్ మహా ధైర్యవంతుడు, చమత్కారి, సాహసి, యోధుడు. ఈయన వానార్ వంశం యువరాజు. తరువాత ఉత్తమ చోళుని పాలనలో దక్షిణ దళాలకు కమాండర్ అవుతాడు. ఈ కథలో ఈయనే హీరో. వందియాదేవన్ కంచిలోని ఆదిత్య కరికలన్ అంగరక్షకుడు, అతని సన్నిహితుడు కూడా. కాంచీలో కొత్తగా నిర్మించిన బంగారు ప్యాలెస్ కు ఆహ్వానించడానికి తంజావూరులోని సుందర చోళ వద్దకు అతడిని దూతగా పంపుతాడు. అలాగే ఇతడు పజారాయ్ లోని కుందవైకి నమ్మకమైన రక్షకుడు. ఏ ప్లాన్ లేకుండా చేసే తొందరపాటు చర్యల వల్ల అతనితో పాటు ఇతరులను ప్రమాదంలో పడేలా చేస్తాయి. తరువాత తన జిత్తుల మారి తనంతో చాకచక్యంగా వాటి నుంచి బయటపడతాడు. అతన్ని కుందవై యువరాణి ప్రమిస్తుంది. అలాగే కందన్మరన్ సోదరి మణిమేకలై అతన్ని ప్రేమిస్తుంది. అయితే ఆమెది వన్ సైడ్ లవ్.

పెరియా పజువేట్టరయ్యర్ శౌర్యానికి మారు పేరు. అనేక యుద్ధాలు చేశాడు. వాటికి గుర్తుగా అతని వంటిపై 64 కత్తి గాట్లుంటాయి. పలువేట్టరయ్యర్ చోళ రాజ్యం ఛాన్సలర్, కోశాధికారి కూడా. చక్రవర్తి తరువాత అత్యంతశక్తివంతుడైన వ్యక్తి. అతను తన అరవైలలో ఉండగా తనక న్నా చాలా చిన్నదైన నందినిని మోహిస్తాడు.ఆమె అందానికి ఆకర్షితుడై వివాహం చేసుకుంటాడు. తరువాత జరిగిన రాజ్య కుట్రలలో ఆమె చేతిలో తోలుబొమ్మగా మారతాడు. నందిన్ స్కెచ్ ప్రకారం అతడు సుందర చోళ కుమారులపై కుట్ర చేస్తాడు. నందిని ప్లాన్ ప్రకారం ఆయన తన బంధువు మదురంతకన్ ని తదుపరి చక్రవర్తిని చేయటానికి ప్రయత్నిస్తాడు.

నందిని పజువూర్ యువరాణి ,పెరియా పజువేట్టరయ్యర్ భార్య. చిన్నప్పుడు ఈమె పుట్టుకపై ఎన్నో అనుమానాలున్నాయి. కథలో ఈమెది ప్రధాన భూమిక. మదురైలో జన్మించిన నందిని యవ్వనం వరకు పజాయరైలో రాజ కుటుంబం పిల్లలతో పాటు పూజారి కుటుంబంలో పెరిగింది. ఆమె అపురూప సౌందర్యరాశి. బాల్యంలో యువరాజు ఆదిత్య కరికలన్ తో ప్రేమలో పడుతుంది. రాజకుటుంబానికి ఇది ఇష్టం ఉండదు. తరువాత ఆమె పజయరాయ్ నుంచి పారిపోయి మదురైలో నివసించవలసి వస్తుంది. యుద్ధంలో గాయపడిన వీరపాండియన్‌ను శిరచ్ఛేదం తరువాత ఆమె పాండ్య కుట్రదారులతో చేతులు కలుపుతుంది. పాండ్యన్ ని చంపిన చోళ రాజవంశాన్ని నాశనం చేసి అతనిపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తుంది. తన అందానికి పిచ్చెక్కిపోయిన పెరియా పజువేట్టరైయార్‌ను వివాహం చేసుకుని అతని ద్వారా ఆమె పాండ్య కుట్రదారులకు సహాయం చేస్తుంది. రాజ కుటుంబం తన పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు వారిపై తీవ్ర ద్వేషం పెంచుకుంటుంది. అలాగే చోళ సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని ఆశిస్తుంది. తన అందానికి పడిపోయిన పార్థీభేంద్ర పల్లవ, కందన్మరన్ లను కూడా తన కుట్రలలో పావులుగా వాడుకుంటుంది.

విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష కృష్ణన్, విక్రమ్ ప్రభు, శోబితా ధులిపాల, జయరామ్, ప్రభు గణేశన్, లాల్, ఐశ్వర్య లక్ష్మి, రెహ్మాన్, అశ్విన్ కాకుమనుతో పాటు తాజా నిలళ్ గళ్ రవిని చేర్చారు. అమలాపాల్ శరత్ కుమార్ కూడా నటిస్తున్నట్టు సమాచారం. సంగీతం ఎఆర్ రహమాన్ అందిస్తున్నారు. మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వం’ని రెండు భాగాలుగా తీస్తున్నారని సమాచారం. ఈ భారీ కథను రెండు భాగాలలో తీస్తేనే కథకు న్యాయం జరుగుతుంది. అనుకన్నది అనుకున్నట్టు జరిగితే పొన్నీయన్ సెల్వం మరో బాహుబలి అయినా ఆశ్యర్యం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here