భారత్ లో కరోనా రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 87,800 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా కేసుల సఖ్య 40 లక్షలు దాటేసింది. కేవలం 13 రోజుల్లో 10 లక్ష్లల కేసులు నమోదు కావటం ఓ రికార్డు. ఏ దేశంలోనూ ఇంత వేగంగా మిలియన్ కేసులు రిజిప్టర్ కాలేదు.
అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ ది మూడో స్థానం. అమెరికా, బ్రెజిల్ లో మాత్రమే ఇప్పటి వరకు నలబై లక్షలకు పైగా కోవిడ్ 19 కేసులు బయటపడ్డాయి. అయితే భారత్ తన మొదటి మిలియన్ కు చేరటానికి 168 రోజుల సమయం తీసుకోగా ..మిగతా మూడు మిలియన్లకు 50 రోజులు పట్టింది. ఇక నాలుగో మిలియన్ కి కేవలం పదమూడు రోజులే కావటం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ నెలలో మన దేశంలో కరోనా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో తెలియదు.