భారతదేశం కాంగ్రెస్ ని పిలుస్తోంది!

3
150

కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు గాక..దేశానికి ఇప్పుడు దాని అవసరం ఎంతో ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కాంగ్రెస్ ముక్త్ భారత్ అసాధ్యం అని తేలిపోయింది. ఈ విష యం అర్థమయ్యేవారికి స్సష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ ఉన్న ఇంత బలహీనమైన స్థితిలో కూడా దేశ వ్యాప్తంగా ఉనికిని కలిగి ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. ఉత్తరాధిలో ఇప్పటికీ అది బలమైన పార్టే. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్,ఛత్తీస్‌గఢ్ లో మెజార్టీ సీట్లు గెలుచుకుంది. దక్షిణాన కర్ణాటక, కేరళలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. పశ్చిమ మహారాష్ట్ర ,గుజరాత్ లో దాని ఉనికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. బెంగాల్, ఇతర తూర్పు రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీ కనుమరుగైంది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ఒక ముఖ్యమైన భూమిక. ఎందుకంటే ఇది అధికార పార్టీ పనితీరు పట్ల కాపలా కుక్కలా పనిచేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధి పత్య ఉనికికి ఎదురునిలవటానికి ఇప్పుడు ఖచ్చితంగా ఓ శక్తివంతమైన, అప్రమత్తత కలిగిన ప్రతిపక్షం అవసరం. కానీ ఆ పనిని కాంగ్రెస్ సరిగా చేయట్లేదని ఎవరైనా అనొచ్చు. కాని ఆ పార్టీ ఉన్నంతవరకు ఆ పని చేసే అవకాశాన్ని మాత్రం ఎవరూ తోసిపుచ్చలేరు. సైన్స్‌లో మాదిరిగా రాజకీయాల్లో కూడా ఆ అవకాశం ఉందని బావిస్తాను.
ఇప్పటికీ వంశపారంపర్య సూత్రం (డైనాస్టిక్ ప్రిన్సిపుల్) కాంగ్రెస్‌ను వెంటాడుతోందని చాలా మంది నమ్ముతారు.ఈ సూత్రం ప్రజాస్వామ్య విలువల తిరస్కరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఒక ఫ్యూడల్ దోరణి. కానీ సంవత్సరాలుగా ఇది భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన లక్షణంగా మారింది. సగటు ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబ విఐపి హోదాను అంగీకరించాయి. రాజకీయా లకు కొత్త అయిన రాజీవ్ గాంధీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావటాన్ని మనం మర్చిపోజాలం, కాబ ట్టి వంశపారంపర్యత అనేది (డైనాస్టిక్) ఇకపై సమస్య కాదు. ఎందుకు దాని పని అయిపోయిందం టే… సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ముగ్గురు గాంధీలు ముందున్నప్పటికీ 500 మందికి పైగా సభ్యులు గల లోకసభలో్ ఆ పురాతన పార్టీ 50 సీట్లకు పడిపోయింది.

అసలు కాంగ్రెస్‌ ఎక్కడ పొరపాటు చేసింది..? దాని తప్పేంటి? గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ రెండు పెద్ద రోగాలో బాధపడుతోందని చెప్పొచ్చు. ఒకటి, ఇది బిజెపి బి టీం లాగా ప్రవర్తిస్తోంది. రెండు, దానికి తిరిగి అధికారంలో్కి రావాలన్న బలమైన సంకల్పానికి దూరమైంది. ఈ రెండు లక్షణాలు విరుద్ధమైనవిగా అనిపించవచ్చు, కానీ అలా అనటానికి వీళ్లేదు. వాస్తవానికి, అధికారానికి రావాలన్న సంకల్పానికి సైద్ధాంతిక నిబద్ధత తోడైనప్పుడే అర్ధవంతమైన రాజకీయ కార్యకలాపాలు సాధ్యమవుతాయి. హిందు త్వంతో ప్రేమ దాని రాజకీయ తెలివికి సంకేతం కాదు. కాంగ్రెస్ తనపై విశ్వాసం కోల్పోయిందని, షార్ట్ కట్స్ కోసం చూస్తోందని మాత్రమే ఇది సూచిస్తుంది. ఇది దాని రాజకీయ మేధస్సు వైఫల్యాన్ని కూడా ప్రతిబింభిస్తుంది. ఎందుకంటే ఒక జట్టు ఉన్నప్పుడు ప్రజలు బీ టీంకు ఎందుకు ఓటు వేయాలి? ఇందు లో ఆశ్చర్యపోవటానికి ఏం లేదు. రాహుల్ గాంధీ దేవాలయాల సందర్శన, యోగులకు దండాలు పెట్ట టం, తన హిందూ ఆధారాలను చాటుకోవడం ఎన్నికల్లో వారికి లాభం కలిగించలేదు. ఒక వేళ అందు లో కాంగ్రెస్ విజయం సాధించినా, అది ఓటమి లాంటి విజయంగానే ఉండిపోయేది. ఎందుకంటే ఆ విజయం కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి దానిలో భాగమైన ఉదారవాద – లౌకిక వారసత్వాన్ని వేరు చేస్తుంది గనుక. సోనియా తరచుగా ‘భారతదేశం ఆలోచన’ గురించి మాట్లాడుతారు. దాని గురించి కేవలం మాట్లాడితే సరిపోదు. దాని మీద చర్చ నడవాలి.

ఎవరో ఒకరు పళ్ళెంలో పెట్టి అధికారం అప్పగిస్తారని అనుకోకూదు. అనేక సందర్భాల్లో మెజార్టీ సీట్లు ఉండి కూడా బిజెపికి కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ముందుచూపు కొరవడిన ఓ వెనుకబడిన విధానమే దాని కారణం. అందుకు గోవా రాష్ట్రం చాలా అద్భుతమైన ఉదాహరణ. రాహుల్ హామ్లేటైజింగ్ – పార్టీ అధ్యక్షుడిగా ఉండడం లేదా పార్టీ అధ్యక్షుడిగా ఉండకపోవడం – అధికార సంకల్పం లేకపోవటానికి ఒక మంచి ఉదాహరణ, ఎందుకంటే ఇది పార్టీ మందకొడిగా నడవడానికి, అలాగే క్యాడర్ నిరాశపడడాని కి కారణమైంది. అదేవిధంగా, పార్టీ అశాకిరణాలుగా బావించే ఇద్దరు యువ నాయకుల్లో ఒకరైన సింధియా పార్టీ నుండి నిష్క్రమించడం, మరో నేత సచిన్ పైలట్ దాదాపు అదే మార్గంలో నడవటాన్ని గమనించాలి. ఈ సమస్య పట్ల అగ్రశ్రేణి నాయకుల అవాస్తవిక ప్రతిస్పందన ఆ పార్టీ అంతర్గత పనితీరు కు, పరిస్థితికి అద్దంపడుతుంది.
ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు(సోనియా, రాహుల్, ప్రియాంక) విజయం అందించలేం అనుకుంటే పార్టీలోని ఇతరులకు చోటు కల్పించాలి. ఆ ముగ్గురు కంటే పార్టీ గొప్పది. పార్టీ కంటే దేశం గొప్పది. కాబట్టి సోనియా ఈ విషయం అర్థం చేసుకోవాలి. పార్టీ కోసం, దేశం పట్ల మరింత శ్రద్ధ వహించాలంటే ఆమె తప్పక రాజనీతిజ్ఞురాలిగా వ్యవహరించాలి. అంతే తప్ప మిల్లును నడిపించే రాజకీయ నాయకురాలులా ఉండకూడదు.

పార్టీలో కార్యనిర్వాహక పదవులను చేపట్టడానికి ఉదార ​​- లౌకిక విలువలకు కట్టుబడి ఉన్న శక్తివంత మైన యువతకు ఆమె పరిస్థితులను సృష్టం చేయాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని అన్ని వర్గాలు, ప్రాంతా లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వృద్ధులు, యువకులు, పురుషులు,మహిళలతో ఆరోగ్యకరమైన సమ్మే ళంగా, భారతదేశ నిజమైన సూక్ష్మదర్శినిలా ఉండనివ్వాలి. పార్టీకి ఒక పునరుజ్జీవనం అవసరం. ఇప్పుడు కూడా సరైన రీతిలో వ్యవహరించకపోవడం అది పార్టీకి మాత్రమే కాకుండా దేశానికి కూడా ద్రోహం అవుతుంది. సోనియా జీ దేశం మిమ్మల్ని పిలుస్తోంది.
(మెయిన్ స్ట్రీమ్ వీక్లీ నుంచి అశోక్ సెల్లీ వ్యాసానికి స్వేచ్ఛానువాదం)

3 COMMENTS

  1. demais este conteúdo. Gostei muito. Aproveitem e vejam este site. informações, novidades e muito mais. Não deixem de acessar para descobrir mais. Obrigado a todos e até mais. 🙂

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here