నింగికేగిన ఎర్రగులాబీ

51
475

ముంబై రెడ్ రోజ్ ..రోజా దేశ్‌పాండే మరణం కార్మికవర్గానికి సాధికారత ఇచ్చిన మహామహుల శకం ముగింపు

91 వసంతాల నిండైన రాజకీయ జీవితం ఆమెది. తండ్రి ప్రఖ్యాత కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ శ్రీపాద్ అమృత్ డాంగే. 1929లో అప్పటి బ్రిటిష్ పాలకులు మీరట్ కుట్ర కేసులో ఆయనను ముంబైలో అరెస్టు చేశారు. అప్పుడు రోజాకు నెలల పిల్ల. కామ్రేడ్ డాంగేపై అభియోగం ఏమిటంటే ఆయనతో పాటు కొందరు విప్లవ సహచరులు సాయుధ తిరుగుబాటుతో బ్రిటిష్ పాలనను పడగొట్టడానికి కుట్ర పన్నారు.ఇదే మీరట్ కుట్రకేసు. రోజా తన తండ్రిని మొదటిసారి జైలులోనే చూసింది. ఆమె తల్లి ఉషతాయ్ కూడా ఒక మిలిటెంట్ ఫైటర్.

ప్రఖ్యాత విప్లవకారిణి రోసా లక్సెంబర్గ్ (1871-1919). లక్పెంబర్గ్ పోలిష్ మార్క్సిస్ట్. తరువాత జర్మన్ పౌరురాలిగా మారి కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. శ్రామిక విప్లవంతో పెట్టుబడిదారీ విధానాన్నిశాశ్వతంగా అంతం చేయాలని ప్రయత్నించారనే ఆరోపణలపై లక్సెంబర్గ్‌ను పోలీసులు అరెస్టు చేసి ఉరితీశారు. లక్సెంబర్గ్ ను ఉరితీసిన పది సంవత్సరాల తరువాత కామ్రేడ్ డాంగే రెండవ సారి అరెస్టు అయ్యారు. (మొదటిసారి 1924 లో కాన్‌పూర్ (కాన్పూర్) కుట్ర కోసం, ఈసారి, 1929 లో, అది మీరట్ కుట్ర కేసు).

కామ్రేడ్ డాంగే, ఆయన భార్య ఉషతాయ్ 1917 బోల్షివిక్ కమ్యూనిస్ట్ విప్లవం నుంచి ఎంతగానో ప్రేరణ పొందారు. వారు తమ ఏకైక కుమార్తెకు గొప్ప రష్యన్ విప్లవకారుడి పేరు పెట్టాలనుకున్నారు. 1933 లో రోజా నాలుగు సంవత్సరాల వయసులో కామ్రేడ్ డాంగే విడుదలయ్యారు. టెక్స్ టైల్స్ వర్కర్స్ సమావేశాలకు ఆమె తన తండ్రితో కలిసి వెళ్లటం ప్రారంభించింది. సహజంగానే ఆమె కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరారు. ఆమె తన టీనేజ్‌లో ఉన్నప్పుడు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా తండ్రి జైలు కు వెళ్లటం ..తిరిగి రావటం జరుగుతుండేది. ఆ సమయంలో మిల్లు కార్మికుల రాడికల్ సంస్థ గిర్ని కామ్‌గార్స్ యూనియన్ కోసం పనిచేయడం ప్రారంభించారు రోజా.

అప్పట్లో ముంబైలో ఏకైక పెద్ద పరిశ్రమ టెక్స్ టైల్స్. దాదాపు రెండు లక్షల మంది కార్మికులు పనిచేసేవారు. లాల్‌బాగ్-పరేల్ టెక్స్‌టైల్ బెల్ట్‌లో ఎర్ర జెండాలదే ఆధిపత్యం. కామ్రేడ్ డాంగేను రెడ్ కింగ్ అని కార్మికులు ముద్దుగా పిలుచుకునేవారు. 1960 లో మహారాష్ట్ర ఏర్పడిన తరువాత సియోన్-ఘాట్కోపర్-విఖ్రోలి, అంధేరి-బోరివాలి, థానేలో పారిశ్రామిక బెల్టులు ఏర్పడిన తరువాత ముంబై విస్తరించడం మొదలైంది. ఫార్మాస్యూటికల్ యూనిట్లు, రసాయన పరిశ్రమ, మెకానికల్ ఇంజనీరింగ్ కర్మాగారాలు ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. రోజా అక్కడి కార్మికులను సంఘటిత పరచటం ప్రారంభించారు. ఆమె ఫార్మాస్యూటికల్ వర్కర్స్ యూనియన్‌ను స్థాపించి పది సంవత్సరాల పాటు దానికి స్వయంగా నాయకత్వం వహించారు. పరిశ్రమలో వేతనాలు, పని పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ఇప్పుడు ఆ రంగంలోని కార్మికులు మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నారంటే ఆనాడు రోజా చేసిన వారి భవిష్యత్ కోసం చేసిన త్యాగం ..ఆమెకు కృతజ్ఞతలు చెప్పాలి వారు.

కామ్రేడ్ డాంగే 1957, 1967 లోక్ సభ ఎన్నికల్లో పారెల్ -లాల్ బాగ్ నుంచి అఖండ మెజార్టీతో ఎన్నికయ్యారు. అక్కడ ఆయన ఎన్నో గొప్ప పోరాటాలకు నాయకత్వం వహించారు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ రోజా 1974 లో లోక్ భ ఉప ఎన్నికలో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. ఆమె ప్రసంగాలు వాడే వేడిగా ఉండేది. మాటలతోనే నిప్పులు కురిపించేది. రోజాలోని తత్వమే ఆమెను ఇందిరా గాంధీకి ప్రియంగా మారింది.ఆ సమయంలో ఇందిరా గాంధీ కాంగ్రెస్‌లో మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలోని ఉద్యమం ఆమె అధికారాన్ని సవాలు చేసింది. కానీ రోజాతో పాటు తండ్రి నేతృత్వంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆమెకు మద్దతిచ్చారు. ఆ నిర్ణయం తీవ్ర వివాదమైంది. కానీ రోజా,ఆమె తండ్రి గాంధీ రాజకీయాలకు అండగా నిలిచారు.

కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన కామ్రేడ్ డాంగే 1978-79లో భటిండాలో జరిగిన ఒక సమావేశంలో ఇందిరాపై తన వైఖరిని ప్రశ్నించినప్పుడు పార్టీ నుంచి తప్పుకోవలసి వచ్చింది. ప్రఖ్యాత కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త మోహిత్ సేన్‌తో కలిసి రోజా, ఆమె భర్త విద్యాధర్ (అలియాస్ బని దేశ్‌పాండే) నాయకత్వం వహించి సమాంతర ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. అప్పటికి తన ఎనభైలలో ఉన్న కామ్రేడ్ డాంగే ఈ సమాంతర నిర్మాణానికి నాయకుడు. రోజా దాని ప్రధాన సమన్వయకర్త. ప్రఖ్యాత నాయకులు ఉన్నప్పటికీ ఆ పార్టీ దేశవ్యాప్తంగా పెద్దగా అనుచరులను సంపాదించలేకపోయింది. కానీ రోజా గొప్ప ఆశావాది, అలాగే నిబద్ధత కలిగిన గొప్ప కార్యకర్త. అలా ఆమె పని చేస్తూనే ఉన్నారు.

ఆమె గొప్ప లౌకిక వాది. ఆమె భర్త సంస్కృతంలో గొప్ప పాండిత్యం కలిగిన వాడు కావటంతో ఆమెకు తత్వశాస్త్రంలో ఆసక్తి కలిగింది. తన తన తండ్రి జీవిత చరిత్రను రాశారు. ఆ పుస్తకం మూడేళ్ల క్రితం విడుదలైంది. దీనికోసం ఆమె దాదాపు 15 సంవత్సరాలు పనిచేసింది. వందలాది పేపర్లు, పార్టీ పత్రాలు, ప్రెస్ క్లిప్పింగ్‌లు, ఫొటోలు సేకరించారు. ఈ నెల19న మరణించేనాటికి ఆమెకు 91 సంవత్సరాలు. నిజం చెప్పాలంటే 91 ఏళ్ల రాజకీయం జీవితం ఆమెది.
(Courtesy Mumbai Mirror)

51 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here