ప్రణయ్ తరహాలో మరో పరువు హత్య

22
467

హైదరాబాద్ లో పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక అల్లుడిని అతి కిరాతంగా హత‍్య చేయించాడో తండ్రి. చందానగర్‌కు చెందిన హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి కిరాయి మనుషులతో హేమంత్‌ను నిన్న మధ్యాహ్నం కిడ్నాప్ చేయించి, సంగారెడ్డిలో హత్య చేయించాడు.

కాగా హేమంత్‌ భార్యతో కలిసి ఉండగానే కిరాయి హంతకులు గురువారం మధ్యాహ్నం వారిద్దరినీ కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువతి మాత్రం కారులో నుంచి తప్పించుకుని 100కి సమాచారం ఇచ్చింది. తన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు హేమంత్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం హేమంత్ మృతదేహం ఉస్మానియాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది. సంగారెడ్డిలో లభ్యమైన హేమంత్‌ మృతదేహం
యువతి తండ్రి ఇచ్చిన సమాచారంతోనే సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో హేమంత్‌ మృతదేహాన్ని కనుగొన్నారు. గచ్చిబౌలి పోలీసులు నిన్న అర్థరాత్రి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఈ హత్యకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు సంగారెడ్డి క్లూస్‌ టీమ్‌ కిష్టాయాగూడెం వెళ్లింది.

22 COMMENTS

  1. Have you ever heard of second life (sl for short). It is essentially a online game where you can do anything you want. sl is literally my second life (pun intended lol). If you want to see more you can see these sl authors and blogs

  2. Together with everything which appears to be building within this subject material, many of your points of view are fairly exciting. Even so, I beg your pardon, because I do not subscribe to your entire theory, all be it exhilarating none the less. It appears to everybody that your remarks are not entirely rationalized and in reality you are generally your self not even totally certain of the assertion. In any event I did enjoy reading it.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here