అమృత నుంచి అవంతి దాక ….ప్రేమే నేరమా..

32
1665

నాడు ప్రణయ్..నేడు హేమంత్
మారుతిరావుకు పట్టిన గతే మా నాన్నకూ పడుతుంది
మేనమామే హంతకుడు..
పోలీసులు పట్టించుకోలేదు..
ఎంత అరిచినా ఎవరూ రాలేదు


హైదరాబాద్ లో కలకలం రేపుతున్న పరువు హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన బాధితురాలు అవంతి కీలక విషయాలు వెల్లడించింది. తమను కిడ్నాప్ చేసినప్పుడు సాయం కోసం గట్టిగా అరిచామని, చాలా మంది ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని అవంతి వాపోయింది. కిడ్నాపర్ల చెర నుంచి తాను తప్పించుకుని.. 100 నెంబర్‌కు ఫోన్ చేస్తే పోలీసులు కూడా పట్టించుకోలేదని ఆరోపించింది. ఫోన్ చేసిన అరగంటకు పోలీస్ వ్యాన్ వచ్చిందని వివరించింది.

మేనమామ యుగంధర్ రెడ్డే తన భర్తను చంపాడని అవంతి ఆరోపించింది. హేమంత్, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నామని, ఈ ఏడాది జూన్ 10వ తేదీన పెళ్లి చేసుకున్నామని చెప్పింది. గొడవలు వద్దనే తన పేర ఉన్న ఆస్తులన్నీ నాన్నకే రాసిచ్చానని అవంతి తెలిపింది. హేమంత్‌కు ఆస్తులు లేవని, అయినా చాలా సంతోషంగా ఉండేవాళ్ల మని …భర్తను తలుచుకుని అవంతి బోరున విలపించింది.

తమకు ప్రాణహానీ ఉందని పోలీసులకు చెప్పామని, అయినా వారు పట్టించుకోలేదని ఆరోపించింది. తన భర్తను చంపిన వారిని ఎన్‌కౌంటర్ చేసినా తప్పులేదంది. ప్రణయ్‌ను చంపించిన మారుతీరావు ఏమయ్యాడు? అంటూ ప్రణయ్, అమృత ఘటనను గుర్తు చేసింది. తన భర్తను చంపిన ఘటనలో అమ్మా, నాన్న సహా అందరూ జైలుకెళ్తారని, తనకు న్యాయం చేయాలని అవంతి వేడుకుంది.

తమకు ఇష్టం లేకుండా తన కూతురుని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో హేమంత్ అనే యువకుడిని అమ్మాయి తండ్రి అత్యంత దారుణంగా చంపించాడు. కుల వివక్ష నేపథ్యంలో జరిగిన ఈ ఉదంతంలో దంపతులైన హేమంత్, అవంతిని ఆమె కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో వారి చెర నుండి అవంతి తప్పించుకోగా, హేమంత్‌ను దుండగులు అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు.

ఈ నేరానికి పాల్పడిన 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హేమంత్ కొంతకాలం నుంచి అవంతి రెడ్డితో ప్రేమలో ఉన్నాడని, అమ్మాయి తండ్రి లక్ష్మరెడ్డి కోరికకు విరు ద్ధంగా వివాహం చేసుకున్నట్లు మాధాపూర్ డిసిపి వెంకటేశ్వరులు తెలిపారు. సెప్టెంబర్ 24 న అమ్మాయి మేనమామ యుగేందర్ రెడ్డి తో పాటు ఇతర బంధువులు చందనాగర్ లోని వారి ఇంటికి వచ్చి అవంతి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లే నెపంతో బలవంతంగా తీసుకెళ్లారని పోలీసులు తెలియజేశారు. హేమంత్ ను సంగారెడ్డి తీసుకువెళ్లి కాళ్ళు చేతులు కట్టిదారు ణంగా చంపేశారని పోలీసులు తెలిపారు. అవంతి కుటుంబ సభ్యులు, కాంట్రాక్ట్ కిల్లర్లు కలిపి మొత్తం 13 మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

32 COMMENTS

  1. Have you ever heard of second life (sl for short). It is essentially a video game where you can do anything you want. SL is literally my second life (pun intended lol). If you would like to see more you can see these Second Life websites and blogs

  2. I loved as much as you’ll obtain performed proper here. The cartoon is tasteful, your authored material stylish. nonetheless, you command get got an edginess over that you want be delivering the following. in poor health undoubtedly come more before again since precisely the similar nearly very often inside of case you defend this hike.

  3. I’m really enjoying the design and layout of your website. It’s a very easy on the eyes which makes it much more enjoyable for me to come here and visit more often. Did you hire out a developer to create your theme? Great work!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here