హేమంత్ హత్య కేసులో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను అవంతి కలిశారు. హేమంత్ కుటుంబసభ్యులతో పాటు తనకు భద్రత కల్పించాలని సీపీకి వినతి పత్రం ఇచ్చారామె. హత్యతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టమని సీపీ సజ్జనార్ అవంతికి హామీ ఇచ్చినట్టు సమాచారం.
పరువు హత్యకు గురైన హేమంత్ మర్డర్ కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఈ కేసు వెనుక ఎవరి ప్రోద్బలం ఉన్నా, ఎవరి ప్రమేయం ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఇంతకు ముందే స్పష్టంచేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసు విచారణ చేపట్టి వీలైనంత త్వరగా నిందితులకు శిక్ష పడేలా చూస్తామని చెప్పిన విషయం తెలిసిందే.