భవిష్యత్ లో గూగుల్ కొత్త పని విధానం .. హైబ్రిడ్ మోడల్

0
86

గూగుల్ ఉద్యోగులు భవిష్యత్తులో హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో పనిచేయనున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ‘భవిష్యత్తులో మరింత సులభతరమైన పని విధానాలు అందుబాటులో వస్తాయని భావిస్తున్నాను. వ్యక్తిగతంగా, లేదా సమూహంగా కఠినమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొత్త అవకాశాలను సృష్టించాలి. కాబట్టి ముందు ముందు పరిస్థితులు మారవనిగానీ, 100 శాతం రిమోట్ తరహాలోనో, లేక మరో విధానంలోనో ఉంటుందని గానీ అనుకోలేం. కానీ మరిన్ని సులభతరమైన విధానాలు, మరిన్ని హైబ్రిడ్ మోడల్స్‌పై మాత్రం మనం దృష్టిపెట్టాల్సి ఉంటుంది…’’ అని పేర్కొన్నారు.

ఉద్యోగులకు తమ ప్రదేశాల్లోనే సదుపాయాలు కల్పించేందుకు గూగుల్ కార్యాలయాలకు పునరాకృతి కల్పిస్తామనీ.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారు కొన్ని రోజులకు ఓ సారి ఆఫీసుకు వచ్చి రిపోర్టు చేయాల్సి ఉంటుందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూలై వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని ప్రకటించిన తొలి కంపెనీల్లో గూగుల్ కూడా ఉన్నట్టు ఆయన గుర్తుచేశారు.

‘‘ఈ సంక్షోభం మొదలైనప్పుడే తీవ్ర అనిశ్చితి ముంచుకురాబోతోందని గుర్తించాను. దీంతో పరిస్థితులకు తగినట్టుగా సాధ్యమైనంత వరకు అనిశ్చితిని తొలగించే ప్రయత్నాలు మొదలు పెట్టాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులు ఏదైనా ప్లాన్ చేసుకునేందుకు కూడా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారనీ.. ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నందు వల్లే వచ్చే ఏడాది వరకు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ను పొడిగించాలని నిర్ణయించినట్టు పిచాయ్ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here