జోహ్రా కు గూగుల్ వందనం.. ఎవరీ జోహ్రా..?

0
152

భారతదేశపు అరుదైన నటీమణి, డ్యాన్సర్ జోహ్రీ సెహగల్. జోహ్రా నటించిన ‘నీచా నగర్’ సినిమా కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన రోజు కావడంతో.. జోహ్రా స్మృత్యర్థం గూగుల్ డూడుల్ రూపుదిద్దుకుంది. 1946లో సెప్టెంబర్ 29న సినిమాను ప్రదర్శించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తొలి భారతీయ నటిగా జోహ్రాకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
1912లో ఉత్తరప్రదేశ్‌లోని షహరన్‌పూర్ గ్రామంలో ఆమె జన్మించారు. పూర్తి పేరు షహిబ్జాది జోహ్రా బేగమ్ ముంజాతుల్లా ఖాన్. డ్యాన్సర్‌గా జీవితం ప్రారంభించినా.. తర్వాత బాలీవుడ్ రంగ ప్రవేశం చేసి ప్రేక్షకులను అలరించారు. ఆమె నటించిన నీచా నగర్ సినిమా కేన్స్ ఇంట్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికై.. ఉత్తమ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. బాలీవుడ్ సినిమాల్లో నటించడమే కాకుండా బీబీసీ టెలివిజన్ షోలలోనూ ఆమె కనిపించారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటి ఎన్నో పురస్కారాలను ఆమె సొంతం చేసుకున్నారు. నిండు నూరేళ్లు జీవించిన జోహ్రా … తన 102వ ఏట 2014లో తుదిశ్వాస విడిచారు.అరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్ జోహ్రాది. తన 95 వ ఏట కూడా అమితాబ్ కు ధీటుగా చీనీకమ్ లో ఉల్లాసంగా నటించి మెప్పించింది. ఆమె చివరి చిత్రం సావరియా 2007లో విడుదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here