కాలం చేసిన మహిమ ..గంగవ్వ!

0
116

బిగ్ బాస్ 4లో ఇప్పడు గంగవ్వ సెంటరాఫ్ అట్రాక్షన్. తెలంగాణలోని మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మిల్కూరి గంగవ్వ నామినేషన్‌ కోసం దేశ విదేశాల్లో వేలాదిమంది ఆన్‌లైన్‌ ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె ఫొటో వాట్సాప్‌ లో చక్కర్లు కొడుతోంది. ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. గంగవ్వను గెలుపుకోసం యూట్యూబ్ అభిమానులు ఆరాట పడుతున్నారు. విదేశాల్లోని తెలుగు కుటుంబాలు ఆమెకు ఓటు వేస్తున్నారు.

నిన్న పల్లెటూరు బామ్మ..నేడు బిగ్ బాస్ సెలబ్రిటీ
ప్రపంచానిక తెలిసేవరు ఎంతటి ప్రతిభ అయినా చీకట్లోనే మగ్గుతుంది. అలాంటి ప్రతిభకు వెలుగులు ప్రసాదించేదే నేటి డిజిటల్ మీడియం. అదే మిల్కూరి గంగవ్వను ఓ విలక్షణమైన యూట్యూబ్ స్టార్నిచేసింది. గంగవ్వ అసలు వయస్పును తెలిపే రికార్డులు లేవు. కాని ఎనిమిది మంది మనవలు మనమరాళ్లకు ఆమె బామ్మ. తెలంగాణలోని లంబడిపల్లి అనే చిన్న గ్రామానికి చెందిన ఈ సాధారణ మహిళ పదిహేను లక్ష్లలకు పైగా సబ్ స్క్రైబర్లు గల యూట్యూబ్ ఛానెల్ మై విలేజ్ షో స్టార్ -అతి పెద్ద స్టార్ అట్రాక్షన్.

మై విలేజ్ షో క్రియేటర్ ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరామ్. 2012 లో దీనిని ప్రారంభించారు. శ్రీరామ్ ఓ షార్ట్ ఫిలిం మేకర్. రైటర్స్, ఎడిటర్స్ , కెమెరా మెన్ సహా తొమ్మిది మంది సభ్యుల బృందం ఈ షోకు పనిచేస్తోంది. గ్రామీణ సంస్కృతి, గ్రామీణ కుటుంబ జీవితంపై హాస్యరస భరితమైన లఘు చిత్రాలను రూపొందిస్తోంది బృందం.శ్రీరామ్ యూట్యూబ్ ప్రారంభించే నాటికి గంగవ్వకు అదేమిటో బొత్తిగా తెలియదు. ఊళ్లో అతడు చెట్లు చేమలనువీడియో తీసేవాడు. అది చూసి గంగవ్వ ఈ పిల్లగాడు ఎందుకు అలా సమయం వృధా చేస్తున్నాడని అనుకునేది. అయితే ఆ వీడియోలతోనే ఒక రోజు తన జీవితమే మారిపోతుందని గంగవ్వ అప్పుడు ఊహించలేదు. మొట్టమొదట 2017 లో గంగవ్వ యూట్యూబ్ లో కనిపించింది.గంగవ్వ కెమెరా ముందు చాలా సహజంగా నటిస్తుంది. ఆమె చదువుకోలేదు. కాని సిబ్బంది ఒక్క సారి స్క్రిప్ట్‌ వివరిస్తే అల్లుకు పోతుంది. దానికి సహజత్వాన్ని జోడించి రిహార్సల్ లేకుండానే షాట్ ఓకే అవుతుంది. ఆమెలోని ప్రతిభ ఇంతలా ప్రకాశించటానికి అసలు కారణం ఆ సహజత్వమే.

ఒక్క షో జీవితాన్నే మార్చింది
గంగవ్వ యూట్యూబ్ స్టార్ గా మారక ముందు పొలం పనులు చేసుకునే ఓ సాధారణ పల్లెటూరు మహిళ. కుటుంబ పోషణకు కూలీ నాలీ చేసింది. బీడీలు, సిగరెట్లు చుట్టింది. ఆమె భర్త బాగా తాగేవాడు. ఎన్నో కష్టాలు పడి ఆమె తన ఇద్దరు కుమార్తెలు ,కొడుకు ను పెంచి పెద్ద చేసింది. ఐతే, మై విలేజ్ షోతో ఆమె జీవితమే మారిపోయింది. గంగవ్వ ఛానెల్ విస్తృత ప్రజాదరణకు నోచుకుంది. యూట్యూబ్ ట్రెండ్ కు ఇది అద్దం పడుతుంది. యూట్యూబ్ భారత్ లో విపరీతమైన పురోగతి సాధించింది. నెలకు దాదాపు 25 కోట్ల మంది క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. విభిన్న భాషా నేపథ్యాల నుంచి సృజనశీలురకు ప్రేక్షకులను అందించే అతి పెద్ద వేదిక యూట్యూబ్. 2019 లో మై విలేజ్ షోకు పది లక్ష్ల మంది సభ్యులయ్యారు. ఆ సందర్భంగా షో నిర్వాహకులకు యూట్యూబ్ బంగారు ఫలకాన్ని పంపింది. గంగవ్వ మాట్లాడే తెలంగాణ యాసే ఈ విజయానికి ప్రదాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్పసిన పనిలేదు. దసరా, దీపావళి వేడుకలు మొదలు ఇంటర్నెట్ వరకు ఏ అంశం మీదైనా పల్లె జీవితం ప్రతిబింభించేలా వ్యంగ్య చిత్రాలను అందించటమే ఈ షో స్పెషాలిటీ. మై విలేజ్ షో వారి విలేజ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియోను మూడు కోట్ల మందికి పైగా వీక్షించారు.

ఎక్కడి నుంచి ఎక్కడికి..
ఇప్పడు గంగవ్వ స్థాయి యూట్యూబ్‌ని మించి పోయింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 41,000 మంది అనుచరులున్నారంటే ఆమె పాపులారిటీ ఎంత విస్తరించిందో. గత సంవత్సరం ఇస్మార్ట్ శంకర్ , మల్లేశం లో నటించి వెండితెర ప్రేక్షకులకు కూడా తన ప్రతిభను పంచింది.గంగవ్వ ఇప్పటి వరకు తన ఊరు , తన పొరుగూళ్లు తప్పించి ఎక్కడికి దూర ప్రయాణాలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. కెమెరా ముందుకు రావటం అంటే గంగవ్వకు చాలా ఇష్టం. నటన పట్ల ఎంతో ప్రేమ. లంబాడపల్లికి వెళ్లిన వారు ఆమెతో సెల్పీ తీసుకోకుండా వెనుదిరగరు. కాలం ఎవరిని.. ఎప్పుడు.. ఏ స్థాయికి తీసుకుపోతుందో ఎవరికీ తెలియదు అనటానిక గంగవ్వ జీవితమే పెద్ద ఉదాహరణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here