అనుష్క బంతులను మాత్రమే ప్రాక్టీస్ చేశాడు…దుమారం రేపుతున్న కామెంట్స్

0
100

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మపై ప్రఖ్యాత కామెంటేటర్, బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆయన్ని వెంటనే కామెంటరీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

‘ఇనోనే లాక్ డౌన్ మే తో బస్ అనుష్క కు గేందోం కి ప్రాక్టీస్ కీ హై ’. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

బహుశా ఆయన లాక్ డౌన్ సమయంలో భార్య బౌలింగ్ లో బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ వైరల్ వీడియోని ఉద్దేశించి అని ఉంటారు. కానీ కోహ్లీ అభిమానులు మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుంటున్నారు.

గవాస్కర్ కావాలనే డబుల్ మీనింగ్ మాటలు మాట్టాడారని, అసలు ఆటలోకి క్రికెటర్ల భార్యలను ఎందుకు లాగుతారని వారు ట్విటర్ వేదికగా ఫైర్ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here