బొగ్గు గనిలో పేలుడు

0
145

శ్రీరాంపూర్ ఏరియాలో దుర్ఘన
కార్మికుడు దుర్మరణం ..నలుగురికి తీవ్రగాయాలు
డిటోనేటర్లు అమర్చుతుండగా ప్రమాదం

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5బీ బొగ్గు గనిలో బుధవారం జరిగిన ప్ర మాదంలో ఓ కార్మికుడు చనిపోయాడు. బ్లాస్టింగ్ కోసం హోల్స్ వేసి డిటొనేటర్లు అ మర్చే క్రమంలో పేలుడు సంభవించింది. దాంతో బొగ్గు గని పైకప్పు కూలి ఒక కార్మి కుడు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోల్ కట్టర్లు గాదె శివయ్య, రత్నం లింగయ్య, పల్లె రాజయ్య, బదలీ వర్కర్ సీ.హెచ్ సుమన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం సెకండ్ షిఫ్ట్‌లో సాయంత్రం 6.00గంటల సమయంలో శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5బీ గనిలో 4 సీమ్ 2డీప్ 36 1/2 లెవెల్‌లో బ్లాస్టింగ్ కోసం హోల్స్ వేసి డెటొనేటర్లు అమర్చే క్రమంలో పేలుడు సంభవించింది. గాయపడిన ఐదుగురు కార్మికులను రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ కార్మికుడు రత్నం లింగయ్య(54) మృతి చెందారు.
ప్రమాదం అత్యంత బాధాకరమని మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె సింగరేణి యాజ మాన్యాన్ని కోరారు. కార్మిక సోదరులు త్వరగా కోలుకోవాలని కవిత ఆకాంక్షించారు. శ్రీ రాంపూర్ ఆర్‌కె5లో బ్లాస్టింగ్ కోసం విధులు నిర్వహిస్తుండగా మిస్‌ఫైర్ కావడంతో ప్ర మాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాదె శివయ్య, పల్లె రాజయ్య, చిలుక సుమన్‌కు గాయాలయ్యాయని సమాచారం అందటంతో కవిత విచారం వ్యక్తం చేశారు. తక్షణ వైద్యసేవలు అందించాలని సింగరేణి శ్రీయాజమాన్యాన్ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here