పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ సంస్కరణల బిల్లులకు నిరసనగా రైతులు సంఘాలు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. అధికార కాంగ్రెస్, మరియు ప్రతిపక్ష ఆప్, అలాగే ఎన్‌డిఎ మిత్రుడు ఎస్ఎడి రైతుల ఆందొళనలకు మద్దతు ఇవ్వడంతో పంజాబ్ బంద్ సంపూర్ణం కానుంది. అలాగే రాష్ట్రం హర్యానా లో కూడా బంద్ పూర్తిగా విజయవంతమ వుతుందని బావిస్తున్నారు.
బంద్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడి వారు అక్కడే నిరసనలు చేస్తారని ..ఢిల్లీ లక్ష్యం కాదని రైతు నేతలు ప్రకటించినప్పట్టికి ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానా నుంచి రైతులు ఢిల్లీని ముట్టడించే అవకాశం ఉందని పోలీసులు ముందస్తు జాగ్ర్తత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే హర్యానా సరిహద్దును మూసివేసారు.
రైతు సంఘాలు ఇచ్చిన “భారత్ బంద్” పిలుపుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుజేవాలా నిన్న ఈ విషయం మీడియాకు తెలిపారు.రైతులు, వ్యవసాయ కూలీలు తమ కష్టంతో ప్రజల కడుపు నింపుతుంటే మోడీ సర్కార్ మాత్రం వారి పొలాలపై దాడి చేస్తోందని ఆరోపించారు. మరోవైపు, యూపీలో ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. వ్యవసాయ బిల్లులు రైతులకు “హానికరం” అని ఆ పార్టీ ఇప్పటికే సంబంధిత జిల్లా న్యాయాధికారుల ద్వారా గవర్నర్‌కు మెమోరాండం సమర్పించనున్నారు.
మరోవైపు, బంద్ నేపథ్యంలో నిన్నటి నుంచే పంజాబ్ లో రైతులు రైలు రోఖో నిర్వహిస్తున్నారు. దాంతో రైళ్లను రద్దుచేశారు అధికారులు. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ పంజాబ్ శాఖ ఇచ్చిన ఆ రాష్ర్ట బంద్ కు 30కి పైగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. సోషల్ మీడియాలో సైతం వ్యవసాయ బిల్లులపై పెద్ద చర్చ జరుగుతోంది. ఆ బిల్లులు చట్టాలుగా మారితే రైతులు మెల్లిమెల్లిగా కార్పోరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతారని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఎవరినీ లెక్కపెట్టకుండా, రైతు నేతలను సంప్రదించకుండా మోడీ సర్కార్ ఏక పక్షంగా వ్యవసాయ బిల్లులు తెచ్చింది.
రైతులే కాదు నెటిజెన్లు సైతం వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త బంద్‌కు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మొదటగా ఉద్యమం ప్రారంభించింది పంజాబ్ రైతులే. పంజాబ్‌లో అనంతరం హర్యానా,ఉత్తర ప్రదేశ్ రైతులు ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ నిరసనలు ప్రారంభించారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో సైతం రైతులు ఉద్యమం చేపట్టారు. వివిధ రాష్ట్రాల్లో రైతులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీల్లో పాల్గొంటున్నారు.
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ ఎమ్మెల్యే నవజ్యోత్‌సింగ్ సిద్ధూ సైతం రైతులకు మద్దతుగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. సేవ్ ఫార్మర్స్ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. కాగా, సిద్ధూ రాష్ట్ర క్యాబినెట్ నుంచి వైదొలిగిన తర్వాత ప్రజల మధ్యకు రావడం ఇదే తొలిసారి.
ఆలిండియా కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ(ఎఐకెఎస్సిసి), ఆలిండియా ఫార్మర్స యూనియన్(ఎఐఎఫ్‌యు), భారతీయ కిసాన్ సంఫ్‌ు(బికెయు), ఆలిండియా కిసాన్ మహాసంఘ్ (ఎఐకెఎం) పిలుపుమేరకు జరుగుతున్న ఈ భారత్ బంద్‌కు దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 20కు పైగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. రైతు సంఘాలకు చెందిన నాయకులు, రైతులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గంటున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో పాటు కర్నాటక, తమిళనాడు, మహరాష్ట్రలకు చెందిన రైతు సంఘాలు కూడా నేటి షట్డౌన్కు పిలుపునిచ్చాయి.