జియోను చూశారుగా…రేపు వ్యవసాయమూ అంతే ..!

0
76


రైతులకు వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు అనుకుంటాం. కానీ వారికి అన్నీ తెలుసు. మన కన్నా వారికే చాలా విషయాలు తెలుసని పట్టణాల్లో ఉన్నవారు తెలుసుకోవాలి. కేంద్రం తీసుకొస్తున్న బిల్లుపై దేశ వ్యాప్తంగా పెద్ద రచ్చ జరుగుతోంది. దానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాటపట్టారు.

ఇంతకు ఈ బిల్లును రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సూటిగా చెప్పారొక రైతు ‘ మొదట జియో లాంచ్‌ అయినప్పుడు తమ మార్కెట్‌ను పెంచుకోవడం కోసం ఉచిత ఫోన్లు ఇచ్చింది. జనాలు వాటికి అలవాటుపడటంతో పోటీ తుడిచిపెట్టుకుపోయింది. దాంతో జియో రేట్లను పెంచింది. ఇప్పుడు వ్యవసా యంలో తీసుకువచ్చే బిల్లులు కూడా ఇలానే ఉంటాయి. పూర్తిగా కార్పొరేట్‌ చేయబోతున్నారు’ అని తెలిపాడు.

ఆ రైతు ఈ మాట తనతో అన్నారని కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన శిరోమణీ అకాలీదళ్‌ ఎంపీ హర్‌ సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ అన్నారు. ఆ ఉదాహరణ సబబుగా తోచింది. అందుకే నేను రాజీనామా చేశాను అన్నారు బాదల్‌. ప్రజల అవగాహనను పరిగణనలోకి తీసుకోకుండా ఈ బిల్లులను ఎలా ఆమోదించారని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఇప్పుడు రాజ్యసభ చేపట్టబోయే ఈ బిల్లులు జూన్‌లో జారీ చేసిన మూడు ఆర్డినెన్స్‌లను భర్తీ చేస్తాయి. కాని రైతుల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత పంజాబ్‌లో తీవ్ర నిరసనలు రేకెత్తించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here