భారతీయ మహిళలు అందవిహీనులు…అమెరికాలో నిక్సన్ టేపుల కలకలం

611
2624

అమెరికా అధ్యక్షులకు నోటి దురుసు ఎక్కువే. చరిత్ర చూస్తే అలాంటి మహాను భావులు ఎందరో కనిపిస్తారు. అంతెందుకు మన కళ్ల ముందే ఉన్నారుగా ట్రం ప్ మహాశయుడు. ఇప్పుడు ఓపెన్ గానే నోటికి వచ్చినట్టు మాట్లాడు తున్నారు. కాకపోతే అప్పట్లో కాస్త రహస్యంగా అనేవారేమో. అయితే కొన్ని విషయాలు ఎం తదాచినా దాగవు.. ఇప్పడుు తాజాగా అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ గారి సంస్కారం ఎంతటిదో తెలిపే ఆడియో టేపులు తాజాగా వెలుగు చూశాయి…

మెరికాతో మనకు ఇప్పుడు మంచి సంబంధాలున్నాయి. కాని ప్రచ్ఛన్న యుద్ధ కా లంలో అమెరికా మనల్ని బద్ధ శత్రులుగా పరిగణించేది. మనది అలీన విధానమైనా సోవియట్ యూనియన్ కు దగ్గర కావటమే అమెరికా కోపానికి కారణం. సందర్భం వచ్చి నప్పుడలల్లా అమెరికా అధ్యక్షులు , మంత్రులు, జాతీయ భద్రతా సలహా దారులు భా రత్ పట్ల తమ అక్కసు వెళ్లగక్కేవారు. వారి నోటికి ఎంత మాట వస్తే అంత. 1971 ఇండో – పాక్ వార్ లో భారత్ గెలిచి బంగ్లాదేశ్ ఏర్పాటైనప్పుడు పాకిస్తాన్ కన్నా ఎక్క వగా అమెరికా ఏడ్చింది. భారత్ గెలుపును జీర్ణించుకోలేకపోయింది. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ అమెరికాను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. అది ప్రెసి డెంట్ నిక్సన్ కు మింగుడు పడలేదు. ఇందిరను b…h,అని bast…అని దూషించే వరకు వెళ్లాడాయన. ఈ విషయాలన్నీ ఆలస్యంగా వెలుగు చూశాయి. ఇప్పుడు తాజాగా మరి కొన్ని టేపులు బయటపడ్డాయి. వాటిలో నిక్సన్ భారతీయ మహిళల పట్ల చేసిన అభ్యంతరకర కామెంట్లు ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల వేళ ఈ టేపులు అమెరికాలో సంచలనం రేపుతున్నాయి.


భారతీయ మహిళలు.. ప్రపంచంలోనే అత్యంత అందవిహీనులు.. సెక్స్‌లెస్, ఆకర్షణ లేనివారు, ఎలా పునరుత్పత్తి చేస్తారో తెలియదు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నిక్సన్‌. ఈ విషయాన్ని తాజాగా ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గ్యారీ జె. బాస్ ది న్యూయార్క్ టైమ్స్‌‌కు ఇచ్చిన ఓపీనియన్ పోల్‌లో వెల్లడించారు. అమెరికాకు 37వ అధ్యక్షుడిగా రిచర్డ్ నిక్సన్ 1969 నుంచి 1974 వరకు పనిచేశారు. ఇక ఆయనకు సంబంధించిన ఈ టేప్స్‌ను రిచర్డ్ నిక్సన్ లైబ్రరీ అండ్ మ్యూజియం విడుదల చేసింది.


భారతీయుల పట్ల నిక్సన్‌లో ఉన్న వ్యతిరేకతకు ఆ సమయంలో జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింజర్ వీరాభిమాని అని బాస్‌ తెలిపారు. అంతేకాక హెన్రీ 1970 ల ప్రారంభంలో భారత్‌ పట్ల అమెరికా విధానాన్ని కూడా నిర్ణయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. జూన్ 17, 1971 న సాయంత్రం 5:15-6:10 గంటల మధ్య జరిగిన సమావేశంలో భాగంగా నిక్సన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిని ఓవల్ ఆఫీస్ టేపింగ్ సిస్టమ్ రికార్డ్ చేసింది. ఈ టేప్స్‌ను బాస్ తన పుస్తకం ‘ది బ్లడ్ టెలిగ్రామ్’లో ప్రస్తావించారు. నిక్సన్ భారతీయ మహిళలను నల్లజాతి మహిళలతో పోల్చారు. ‘నా ఉద్దేశ్యం ఏమిటంటే, బ్లాక్ ఆఫ్రికన్లలో కొద్దిగా ఆకర్షణ ఉంటుంది. కానీ భారతీయ మహిళలు చూడటానికి అందవిహీనులుగా ఉంటారు’ అని నిక్సన్ పేర్కొన్నారు. నవంబర్ 4, 1971 లో, కిస్సింజర్, విదేశాంగ కార్యదర్శి విలియం రోజర్స్ తో భారత-పాకిస్తాన్ ఉద్రిక్తతల గురించి జరిగిన చర్చ మధ్యలో, రోజర్స్ గాంధీని మందలించడాన్ని ప్రస్తావించిన తరువాత, “వారు పిల్లలన్ని ఎలా కంటారో నాకు తెలియదు!”
అంతేకాక ఈ టేపులు అంతర్జాతీయ సంఘటనలు, నటుల పట్ల నిక్సన్‌ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. వ్యక్తిగత జాత్యహంకారం, భారతీయుల పట్ల అతని వ్యతిరేకతను ఈ టేపులు వెల్లడిస్తున్నాయి. తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాల విషయలో కూడా నిక్సన్ సానుకూల వైఖరిని కలిగి ఉండటమే కాక భారత్ పట్ల ఎంతటి శత్రుత్వం కలిగి ఉన్నారో కూడా ఈ టేపులు స్పష్టం చేస్తున్నాయి. 2012, డిసెంబర్ లో, డిక్లాసిఫికేషన్ సమీక్ష కోసం రిచర్డ్ నిక్సన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియంతో బాస్ చట్టపరమైన అభ్యర్థనను దాఖలు చేశారు.
ఇందిర చేతిలో నిక్సన్ భంగపాటు
1971లో అమెరికా అండతో పాకిస్తాన్ భారత్ పై యుద్ధం గెలవాలనుకుంది..కాని దాని పప్పులుడకలేదు. ఆ అక్కసుతోనే ఆయన, భద్రతా సలహాదారు హెన్రీ కిస్పింజర్ ఇందిరను తీవ్ర పదజాలంతో దూషించారు. ఆ విషయం వెలుగు చూడటంతో కిస్పింజర్ 2005లో భారత్ కు క్షమాసణ చెప్పాడు. నిజానికి 1971లో పాకిస్తాన్ తో యుద్దానికి ఇందిర కాలుదువ్వలేదు. డిసెంబర్ 3, 1971 న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తొమ్మిది భారతీయ ఎయిర్ బేస్ ల మీద దాడికి తెగబడింది. దాంతో ఇందిరకు యుద్ధం తప్ప వేరే మార్గం కనిపించలేదు.


ప్రతి పక్ష నేతలతో సమావేశమై మనపై యుద్ధాన్ని రుద్దుతున్నారని జాతికి సందేశం ఇచ్చారు ఇందిర. గత తొమ్మిది నెలలుగా పశ్చిమ పాకిస్తాన్ సైనిక ప్రభుత్వం బంగ్లా దేశ్ లో ఆటవిక పాలన సాగించి స్వేచ్చా హక్కులను అతి కిరాతకంగా ఎలా అణచి వేస్తోందో .. మాటల్లో చెప్పలేనంత హీనంగా అక్కడి ప్రజలపై దారుణాలకు పాల్ప డిందో.. లక్షలాది మందిని ఎలా అంతం చేసిందో ప్రధాని ఇందిరా గాంధీ పార్లమెంట్ ప్రసంగంలో అప్పటి పరిస్థితిని వివరించారు…పాక్ సైనికుల దురాగాతాల నుంచి తప్పించుకుని లక్షలాది మంది ఆశ్రయం కోసం భారత్ లో ప్రవేశిస్తున్నారని.. ఇది మన దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తుందని ప్రపంచానికి తెలిసేలా చేశామని, దీంతో మన పట్ల సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతోందన్నారు ఇందిర. అనంతరం పాకిస్తాన్ పై భారత్ బహుముఖ సైనిక దాడులతో ప్రతీకార చర్యలు చేపట్టింద. రెండు రోజుల తరువాత ఇందిర బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించింది. దీనికి కౌంటర్ గా భారత్ ని బెధిరించేందుకు అధ్యక్షుడు నిక్సన్ యుఎస్ 7 వ నౌకాదళాన్ని బెంగాల్ బేకు పంపించాడు, దీనికి కౌంటర్ గా మన మిత్ర దేశం సోవియట్ నౌకాదళం బెంగాల్ బేలోకి ప్రవేశించటంతో అమెరికా ఆశలు అడియాసలయ్యాయి. నిక్సన్ తీవ్ర ఆగ్రహంతో ఇది పాకిస్థాన్‌పై భారత్ దుందుడుకు చర్య అంటూ చిందులేశాడు.


పాకిస్తాన్ దళాలు భేషరతుగా భారతీయ దళాలలకు లొంగిపోయాయని, బంగ్లాదేశ్ విముక్తి అయిందని డిసెంబర్ 16 న జనరల్ మానెక్ షా ప్రధాని ఇందిరకు చెప్పారు. ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, విదేశాంగ విధాన తిరుగుబాటు, కొత్త భారతదేశం వచ్చిందని ప్రపంచానికి ఇచ్చిన సందేశం.

నిక్సన్ తక్కువ వాడేమీ కాదు..కుల్లు కుతంత్రాలు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రెండో దఫా అధ్యక్షుడు అయిన కొద్ది కాలానికే ఆయన వాటర్ గేట్ కుంభకోణం లో చిక్కుకున్నారు. ఇది ఓ రాజకీయ కుంభకోణం. వాషింగ్టన్ పోస్ట్ ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది. ఫలితంగాఆయన మహాభియోగాన్ని ఎదుర్కోని పదవి పోగొట్టుకున్నారు.

611 COMMENTS

  1. ivermectin liquid [url=https://topivermectin.com/#]ivermectin tablets order [/url] ivermectin paste 1.87 dosage for dogs ivermectin how long to work

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here