ట్రంప్ మెడకు పోర్న్ స్టార్ ..

0
38

మెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో… అధ్యక్షుడు ట్రంప్‌కి మరో తలనొప్పి ఎదురైంది. ఆయన్ని ఇరకాటంలో పెట్టేందుకు మరో అస్త్రం తెరపైకి వచ్చింది. ఆ అస్త్రం పేరే స్టార్మీ డేనియల్స్. వృత్తి రీత్యా పోర్న్ స్టార్. స్టార్మీ డేనియల్స్ పేరుతో పోర్న్ సినిమాల్లో నటించే స్టెఫానీ క్లిఫోర్డ్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 44,100 డాలర్లు చెల్లించాలని చెల్లించాలని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది.

లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా సుపీరియర్ కోర్ట్ ఈ వివాదంలో క్లిఫోర్డ్ ప్రధానమైన పార్టీ అని తీర్పు ఇచ్చింది, అందువల్ల ఆమె లీగల్ ఫీజును ట్రంప్ నుంచి పొందే హక్కును పొందారని కోర్టు చెప్పింది. ఇది తనకు మరో విజయం అంటే స్టార్మి డేనియల్స్ ట్విటర్ లో పోస్ట్ చేసింది. మరోవైపు కోర్టు తీర్పుపై ట్రంప్ గానీ, వైట్ హౌస్ అధికారులు , ట్రంప్ న్యాయవాదులు ఇంకా స్పందించలేదు.

ట్రంప్ తో తన ఎఫైర్ గురించి బయటకు వెల్లడించకుండా ఉండేందుకు 2016లో అప్పటి ట్రంప్ న్యాయవాది ఆమెకు 1.30 లక్షల డాలర్లు ముట్టచెప్పేందుకు ఒప్పందం చేసుకున్నారన్నదే ఈ వివాదం. 2006 నుంచి 2007 వరకు తనకు ,ట్రంప్‌కు ఉన్న వ్యవహారం గురించి క్లిఫోర్డ్ మాట్లాడకుండా ఈ ఒప్పందం నిరోధించింది. అయితే ఆమెతో తనకు ఎఫైర్ లేదని ట్రంప్ ఖండించారు.

స్టార్మీ డేనియల్స్ పేరుతో తెరపై కనిపించే పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్ తనకు ట్రంప్‌తో సంబంధాలున్నాయని.. దశాబ్దం క్రితం ఇద్దరి మధ్య జరిగిన శృంగార కార్యకలాపాలను బయటపెట్టకుండా నోరు మూసేందుకు ఆయన 1.30 లక్షల డాలర్ల సొమ్మును తన లాయర్ ద్వారా పంపారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు అమెరికాలో పెను సంచలనం సృష్టించింది. క్లిఫోర్డ్‌కు తాను డబ్బులు చెల్లించిన మాట నిజమేనని.. ట్రంప్ వద్ద సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న లాయర్ మైఖెల్ కోహెన్ అప్పట్లో అంగీకరించారు. అయితే ఆ సొమ్మును ఎందుకు ఇచ్చారనే విషయాన్ని వెల్లడించలేదు. కానీ మైఖెల్ క్లిఫోర్డ్‌కు డబ్బులిచ్చిన సంగతి తనకు తెలియదని ట్రంప్ ఇదివరకే చెప్పారు.

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 11 రోజుల ముందు… ట్రంప్ పర్సనల్ సెక్రెటరీ నుంచి తాను డబ్బు తీసుకున్నాని పోర్న్ స్టార్ డేనియల్స్ చెబుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… ఓ పోర్న్ స్టార్‌కి రూ.33 లక్షలు చెల్లించాలని తద్వారా ఆమె తన కేసుకి సంబంధించి… అయిన లాయర్ల ఖర్చులను భర్తీ చేసుకున్నట్లు అవుతుందని… జడ్జి ఆదేశించారు. అందువల్ల ట్రంప్ ఆ డబ్బు చెల్లించే అవకాశాలు ఉన్నాయి.

డేనియల్స్ అసలుపేరు స్టెఫానీ క్లిఫ్ఫర్డ్. 2018లో ట్రంప్‌కి వ్యతిరేకంగా కోర్టులో దావా వేసింది. తమ మధ్య ఉన్న రహస్యాన్ని బయటపెట్టకుండా ఉంచే అగ్రిమెంట్‌ని రద్దు చేయించమని కోర్టును కోరింది. అలాగే… ట్రంప్ మాజీ పర్సనల్ సెక్రెటరీ మైకెల్ కొహెన్ దగ్గర తాను డీల్‌కి ఒప్పుకుంటూ చేసిన సంతకాన్ని కూడా రద్దు చేయాలని కోర్టును కోరింది.


2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 11 రోజుల ముందు… ట్రంప్‌తో డీల్ కుదుర్చుకుంటూ… ఆయన పర్సనల్ సెక్రెటరీ మైకెల్ కొహెన్ నుంచి తాను 130000 డాలర్లు (దాదాపు రూ.కోటి) పొందినట్లు డేనియల్స్ చెబుతోంది. ఎన్నికల తర్వాత… ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక… స్టార్మీ డేనియల్స్ ట్రంప్‌కి వ్యతిరేకంగా మారింది.


డేనియల్స్ వేసిన దావాను కోర్టు కొట్టివేసింది. ఇందుకు చాలా కారణాలున్నాయి. కేసు గెలవలేదు కాబట్టి డేనియల్స్… లాయర్ల ఫీజులను అడిగే ఛాన్స్ లేదని అధ్యక్షుడు ట్రంప్ తరపు లాయర్లు అంటున్నారు. జడ్జి రాబెర్ట్ బ్రాడ్‌బెల్ట్ 3, ఈ వాదనను ఒప్పుకోలేదు. లాయర్ల ఖర్చులు చెల్లించాల్సిందే అన్నారు. అలా లాయర్ల ఖర్చులు చెల్లించాలంటే… అసలీ డీల్‌… ట్రంప్‌తో కుదిరినట్లు డేనియల్స్ నిరూపించాలని ట్రంప్ తరపు లాయర్లు వాదించారు.
ట్రంప్ పర్సనల్ సెక్రెటరీ మైకెల్ కొహెన్… ట్రంప్‌కి షాడో లాంటి వారనీ, చాలా సాక్ష్యాలు ఉన్నాయని… జడ్జి తన లిఖితపూర్వక ఆదేశంలో తెలిపారు.

ఈ కేసుపై… ట్రంప్ లేదా వైట్‌హౌస్ ఇంకా ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. కానీ… పోర్న్ స్టార్ మాత్రం తన ట్విట్టర్ అకౌంట్‌లో తనకు మరో గెలుపు అని రాసుకుంది. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ అంశం కూడా ట్రంప్‌కి సమస్యగా మారేలా కనిపిస్తోంది. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ అంశం కూడా ట్రంప్‌కి సమస్యగా మారేలా కనిపిస్తోంది.
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ అంశం కూడా ట్రంప్‌కి సమస్యగా మారేలా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here