అమెరికా కీచకుడు….ఆమెని ఆక్టోపస్ లా చుట్టేశాడు..!

0
136

ఎన్నికల వేళ ట్రంప్ కు అన్నీ అపశకునాలే. చేసిన పనులు ఊరకే పోవు కదా.. కర్మ ఫలం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రసిక చక్రవర్తని తెలుసు. సిల్వర్ స్పూన్ తో పుట్టిన ఆయన ఓ ప్లేబాయ్ లా యవ్వ్జావనాన్ని ఎంజాయ్ చేశాడు. కానీ భవిష్యత్ లో అమెరికా అధ్యక్షుడిని అవుతానని అనుకుని ఉండడు. అప్పుడు ఎవరెవర్ని చెరబట్టాడో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.

ఆడవారి విషయంలో ట్రంప్ ట్రాక్ రికార్డు మామూలుగా లేదు. ఇష్టపడ్డ మహిళను వదలడు. బలవంతగానైనా అనుభవిస్తాడని ఆయనపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. అలాంటిదే ఇది కూడా…తాజాగా అమీ డోరిస్ అనే ఓ మాజీ మోడల్ ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.

1997 లో తన యుఎస్ ఓపెన్ విఐపి సూట్‌లో ట్రంప్ తనపై దాడి చేశాడని అమీ డోరిస్ బ్రిటిష్ పత్రిక ది గార్డియన్‌ కు చెప్పింది… సూట్ లోకి వెళ్లగానే అతను (ట్రంప్) నన్ను బలంగా చుట్టేశాడు..ఆ పట్టు నుంచి బయటపడలేననిపించింది… ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు అప్పటి బాధాకర ఘటనను తలుచుకుంటూ తన రెండు చేతులతో వంటిని కప్పుకుంది డోరిస్.

డోరిస్ ఇంకా ఏం చెప్పిందంటే.. “నన్ను ఏదో ఆక్టోపస్ గట్టిగా చుట్టేసినట్టనిపించింది, నేను ట్రాప్ అయ్యాననిపించింది” … వద్దు వద్దని వేడుకున్నా ..కానీ అతను వద్దలేదు… ఇక తప్పించుకోవటం జరగని పని అని అర్థమైందని తెలిపింది…

ట్రంప్ చెరబట్టినప్పుడు డోరిస్ వయసు 24 సంవత్సరాలు అతనికి 51. అప్పుడు ఆయన కొత్తగా హాలీవుడ్ నటి మార్లా మాపు ల్స్ ని రెండవ వివాహం చేసుకున్నాడు కూడా…ట్రంప్ తో కలిసి ఉన్న ఫొటోలను డోరిస్ పత్రికకు చూపించింది.

డోరిస్ చెపుతున్నదానితో చాలా మంది ఏకీబవిస్తున్నారు. అప్పట్లోనే ఈ విషయం తమకు చెప్పిందని వారు గుర్తు చేసుకున్నారు. అయితే ఈ ఘటన తరువాత కూడా ఆమె ట్రంప్ తో కలిసి ఎందుకు తిరిగిం ది అన్నది ప్రశ్న. అయితే దీనికి ఆమె ఏమంటారంటే. మనకు జరగరానిది జరిగినప్పుడు మెదడు స్థంభించి పోతుంది..నా విషయంలో కూడా అదే జరిగింది అంది…

నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలో ట్రంప్ ..జో బిడెన్‌తో తలపడడానికి కేవలం కొన్ని వారాల ముందు చేసిన ఈ ఆరోపణ రాజకీయంగా ప్రేరేపించబడినదని ట్రంప్ లాయర్లు కొట్టిపారేశారు. అలా జరిగిందనటానికి కనీసం ఒక్క సాక్షి అయినా ఉంటారు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు….

డోరిస్ కి ఇప్పుడు 48 ఏళ్లు. ఆమెకు టీనేజ్ లో ఉన్న ఇద్దరూ కూతుళ్లున్నారు. తన కూతుళ్లకు రోల్ మోడల్ గా ఉండాలనే ఇప్పడు ఈ విషయం బయటపెడుతున్నానని డోరిస్ చెప్పుకొచ్చింది…ట్రంప్ కు ఇలాంటివి కొత్తేమీ కాదు ..దాదాపు డజనుకు పైగా లైంగిక ఆరోపణలను ఎదుర్కొన్నాడు. 1990 ల మధ్యలో ఒక డిపార్ట్మెంట్ స్టోర్ బట్టలు మార్చుకునే గదిలో తనను రేప్ చేశాడని ప్రముఖ అమెరికన్ కాలమిస్ట్ ఇ జీన్ కారోల్ అనే మహిళ ఆరోపించింది.

2016 ఎన్నికల ముందు, 2005 నాటి ఒక టేప్ రికార్డింగ్ బయటపడింది. దీనిలో అతను మహిళల పట్ల ఎంత నీచంగా మాట్లాడో రికార్డయింది. తనకున్న పేరు పలుకుబడికి ఏ ఆడదంటే ఆ ఆడది తన పక్కలో పడుకుంటుంది అన్నిట్టు ప్రగల్భాలు పలికాడు. ట్రంప్ మొదట దీనిని కొట్టి పారేశాడు కానీ తరువాత క్షమాపణలు చెప్పారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరి కొన్ని వారాలే ఉంది. రిపబ్లికన్స్ తరపున ట్రంప్ మరో ఛాన్స్ కోసం బరిలో దిగుతున్నారు. ప్రస్తుత ప్రచార సరళి చూస్తుంటే ట్రంప్ కు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావటం ఆయన్ని ఇరిటేట్ చేసే అంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here