డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి

0
29

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన కొత్త టీంని ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడుగా జేపీ నడ్డా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల తర్వాత తొలిసారి కొత్త నియామకాలు జరిపారు. పార్టీ ఉన్నత పదవులను నుంచి కొందరికి బై చెప్పి మరికొందరి వెల్ కమ్ పలికారు. వివిధ రాష్ట్రాల్లో నాయకత్వాన్ని బలిష్టం చేసే దిశగా ఈ నియామకాలు చేపట్టారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులు చోటుచేసుకోవడం విశేషం. తెలంగాణ నుంచి డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఆమె తోపాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా డాక్టర్ రమణ్ సింగ్, ముకుల్ రాయ్, అన్నపూర్ణ దేవి, బైజయంత్ జే పాండాల, వసుంధరా రాజేలను నియమించారు. యువ మోర్చా అధ్యక్షుడుగా తేజస్వి సూర్యను నియమించారు.

ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రామ్ మాధవ్, మురళీధర్ రావు, అనిల్ జైన్‌లకు ప్రధాన కార్యదర్శుల బాధ్యతల నుంచి తప్పించారు. పంజాబ్‌కు చెందిన తరుణ్ చుగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా తీసుకువచ్చారు. మాజీ కేంద్రం మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజను పార్టీ కార్యదర్శిగా అప్పాయింట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here