కే. విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రమణ్యం అనుబంధం గురుంచి మన అందరికీ తెలుసు. బాలు మరణం ఆయనను తీవ్రంగా కలచివేసింది. దీనిపై కె.విశ్వనాథ్ ఓ వీడియోలో స్పందించారు.
భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలు తన సోదరుడే కాకుండా తన ఆరోప్రాణం కూడా అని పేర్కొన్నారు. బాలు ఇంత త్వరగా వెళ్లిపోతాడని ఊహించలేదని, ఇలాంటి సమయంలో ఏంమాట్లాడతామని ఆవేదన వెలిబుచ్చారు. “వాడి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని వాడి కుటుంబ సభ్యులు ఓర్చుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షిస్తున్నాను” అని కె.విశ్వనాథ్ తెలిపారు. ఇంతకంటే ఇంకేమీ మాట్లాడలేనంటూ సెలవు తీసుకున్నారు.